IND Vs SA Test Series: టీమ్ఇండియాతో టెస్టు సిరీస్ కు క్వింటన్ డికాక్ దూరం

IND Vs SA Test Series: డిసెంబరు నెలాఖరు నుంచి టీమ్ఇండియాతో జరగనున్న టెస్టు సిరీస్ కు దక్షిణాఫ్రికా వికెట్ కీపర్ క్వింటన్ డికాక్ దూరం కానున్నాడు. అయితే అతడి స్థానంలో యువ క్రికెటర్ కు జట్టులో ఆడించే అవకాశం ఉందని సౌతాఫ్రికా క్రికెట్ వర్గాలు అంటున్నాయి.  

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 14, 2021, 08:51 AM IST
IND Vs SA Test Series: టీమ్ఇండియాతో టెస్టు సిరీస్ కు క్వింటన్ డికాక్ దూరం

IND Vs SA Test Series: టీమ్​ఇండియాతో జరగనున్న సిరీస్​లో మూడో టెస్టుకు దక్షిణాఫ్రికా వికెట్​కీపర్​ క్వింటన్​ డికాక్​ దూరం కానున్నట్లు సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు అధికారులు అంటున్నారు. డికాక్ భార్య సాషా జనవరిలో తమ తొలి బిడ్డకు జన్మనివ్వనుండటమే అందుకు కారణమని తెలుస్తోంది. అయితే బయోబబుల్ సహా ఇతర ఆంక్షల వల్ల రెండో టెస్టుకూ అతడు అందుబాటులో ఉండకపోవచ్చని సమాచారం.

భార్య ప్రసవించే సమయంలో తాను దగ్గర ఉండాల్సిన అవసరం ఉండటంతో డికాక్ పితృత్వపు సెలవులు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. బయో-బబుల్, ఇతర పరిమితుల కారణంగా అతను రెండో సిరీస్ కూడా దూరమయ్యే అవకాశం ఉందని సమాచారం. డికాక్ చివరిసారిగా UAEలో జరిగిన T20 ప్రపంచ కప్‌లో దక్షిణాఫ్రికా తరపున ఆడాడు. 

డికాక్‌ గైర్హాజరీలో ర్యాన్ రికెల్టన్‌, కైల్ వెర్రిన్ లతో వికెట్‌కీపింగ్ బాధ్యతలను అప్పగించనున్నారు. మూడు టెస్ట్‌ల సిరీస్‌ కోసం టీమిండియా డిసెంబర్‌ 16న దక్షిణాఫ్రికాకు బయల్దేరనుంది. భారత పర్యటనలో భాగంగా సెంచూరియన్‌ వేదికగా డిసెంబర్ 26 నుంచి డిసెంబర్ 30 వరకు తొలి టెస్ట్‌ జరుగనుంది. 

జొహన్నెస్‌బర్గ్‌ వేదికగా వచ్చే ఏడాది 2022 జనవరి 3 నుంచి 7 వరకు రెండో టెస్ట్‌ జరుగనుంది. కేప్‌టౌన్‌ వేదికగా జనవరి 11 నుంచి జనవరి 15 వరకు మూడో టెస్ట్‌ జరుగనుంది. ఆ తర్వాత జట్లు మూడు వన్డేలు ఆడనున్నాయి. 

Also Read: Rohit Sharma: కోహ్లీ కెప్టెన్సీ గురించి మొదటిసారి స్పందించిన రోహిత్.. ఇంతకీ ఏమన్నాడో తెలుసా?

Also Read: ICC Player of The Month: ఐసీసీ 'ప్లేయర్​ ఆఫ్​ ది మంత్'​గా వార్నర్​, హేలీ మ్యాథ్యూస్ 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News