Pervez Musharraf: గంగూలీకి ముషారఫ్ ఫోన్.. రెండు దేశాల మధ్య యుద్ధం జరుగుతుందని వార్నింగ్

Pervez Musharraf Call to Sourav Ganguly: 2004లో పాక్‌లో పర్యటించిన టీమిండియా.. అద్భుతమైన ఆటతీరుతో టెస్ట్, వన్డే సిరీస్‌ను కైవసం చేసుకుంది. అప్పటి భారత కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఆనంద పడిపోయాడు. అయితే గంగూలీ చేసిన ఓ పనికి వెంటనే ముషారఫ్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది. రెండు దేశాల మధ్య యుద్ధం జరుగుతుందంటూ వార్నింగ్ కూడా ఇచ్చారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 5, 2023, 07:03 PM IST
Pervez Musharraf: గంగూలీకి ముషారఫ్ ఫోన్.. రెండు దేశాల మధ్య యుద్ధం జరుగుతుందని వార్నింగ్

Pervez Musharraf Call to Sourav Ganguly: పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్‌ ముషారఫ్‌ (79) అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారు. గతకొద్ది రోజులుగా ఆయన అరుదైన వ్యాధికి చికిత్స పొందుతున్నారు. యూఏఈలో ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ముషారఫ్ మరణ వార్తను ఆయన కుటుంబ సభ్యులు ధృవీకరించారు. అనారోగ్యం కారణంగా రెండు వారాలుగా ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నారు. రాజకీయ ప్రపంచంలో పేరు తెచ్చుకున్న ముషారఫ్ కూడా క్రికెట్‌కు కూడా వీరాభిమాని. ఒకసారి అప్పటి భారత కెప్టెన్ సౌరవ్ గంగూలీకి ఫోన్ చేసి రెండు దేశాల మధ్య యుద్ధం జరుగుతుందని పెద్ద వార్నింగ్ ఇచ్చారు. ఎందుకు ఫోన్ చేశారో వివరాలు ఇలా..

2004లో గంగూలీ సారథ్యంలో టీమిండియా పాకిస్థాన్‌లో పర్యటించింది. ఈ క్రమంలోనే భారత జట్టు టెస్టు, వన్డే సిరీస్‌లలో తన ఆధిక్యాన్ని ప్రదర్శించి పాక్‌ను చిత్తు చేసింది. 50 ఏళ్ల తర్వాత పాకిస్థాన్‌లో తొలిసారి గెలిచిన కెప్టెన్ సౌరవ్ గంగూలీ చాలా సంతోషంగా ఉన్నాడు. ఈ సిరీస్ తర్వాత సౌరవ్ గంగూలీ గుర్తుచేసుకున్నాడు, 'వన్డే మ్యాచ్ గెలిచిన తర్వాత నేను భారత్‌కు చెందిన స్నేహితులతో కలిసి తినడానికి బయటకు వెళ్లాను. నేను ఎప్పుడూ పాకిస్థాన్‌లో తుపాకీలను చూసేవాడిని.. నేను భద్రత కోసం పోలీసులను తీసుకెళ్లాలని అనుకోలేదు. మేము భద్రతా లేకుండానే బయటకు వెళ్లాం. కానీ ఫుడ్ స్ట్రీట్ వద్ద ఆహారం తీసుకుంటూ దొరికిపోయాం. ఆ రోజు రాత్రికి తిరిగి హోటల్‌కు వచ్చాం.

మరుసటి రోజు ఉదయం 11 గంటలకు నాకు పర్వేజ్ ముషారఫ్ నుంచి కాల్ వచ్చింది. మరోసారి ఇలా ఎప్పుడు చేయవద్దని చెప్పారు. ఏదైనా జరిగితే రెండు దేశాల మధ్య యుద్ధం జరుగుతుందన్నారు. చాలా సెన్సిటివ్‌ అంశం అన్నారు. ఇక నుంచి ఇలా చేయనని నేను ఆయనకు చెప్పాను..' అని గంగూలీ గతంలో ఓ సందర్భంగా చెప్పాడు.

పర్వేజ్ ముషారఫ్ జూన్ 2001 నుంచి ఆగస్టు 2008 వరకు పాకిస్థాన్ అధ్యక్షుడిగా ఉన్నారు. ముషారఫ్ చాలా కాలంగా అమిలోయిడోసిస్ వ్యాధితో బాధపడుతూ దుబాయ్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. జూన్ 2022లో ఆయన అమిలోయిడోసిస్ అనే వ్యాధితో బాధపడుతున్నాడని కుటుంబ సభ్యులు ట్విట్టర్‌లో తెలిపారు. ఆ తర్వాత ఆయన చాలా నెలలు ఆసుపత్రిలో ఉన్నారు. 2007లో పాకిస్థాన్‌లో ఎమర్జెన్సీ విధించినందుకు, రాజ్యాంగాన్ని సస్పెండ్ చేసినందుకు 2013లో పర్వేజ్ ముషారఫ్‌పై దేశద్రోహం కేసు నమోదైంది. 2014 మార్చి 31న ముషారఫ్‌ను కోర్టు దోషిగా నిర్ధారించింది. ఆయన కోర్టు ముషారఫ్‌కు ఉరిశిక్ష విధించింది. అయితే పాక్ నుంచి వెళ్లిపోయి దుబాయ్‌లో తల దాచుకుంటున్నారు. 

Also Read: IND Vs AUS: ఆసీస్-భారత్ టెస్ట్ సిరీస్.. ఈ ఐదుగురు ఆటగాళ్లపై ఓ లుక్కేయండి   

Also Read: India Vs Australia: అశ్విన్ పేరు వింటేనే ఆసీస్‌కు దడ.. కంగారూల భయానికి కారణం ఇదే..!  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook

Trending News