Kane Williamson: రెండోసారి తండ్రైన కేన్ విలియమ్సన్.. లిటిల్ మ్యాన్‌కు స్వాగతం అంటూ!

Kane Williamson and his Wife Sarah Raheem Welcome Baby Boy. న్యూజిలాండ్ క్రికెట్ జట్టు కెప్టెన్, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ సారథి కేన్ విలియమ్సన్ రెండోసారి తండ్రి అయ్యాడు. 

Written by - ZH Telugu Desk | Last Updated : May 23, 2022, 11:25 AM IST
  • రెండోసారి తండ్రైన కేన్ విలియమ్సన్
  • లిటిల్ మ్యాన్‌కు స్వాగతం అంటూ
  • ఇన్‌స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో
Kane Williamson: రెండోసారి తండ్రైన కేన్ విలియమ్సన్.. లిటిల్ మ్యాన్‌కు స్వాగతం అంటూ!

New Zealand Captain Kane Williamson and his Wife Sarah Raheem Welcome Baby Boy: న్యూజిలాండ్ క్రికెట్ జట్టు కెప్టెన్, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ సారథి కేన్ విలియమ్సన్ రెండోసారి తండ్రి అయ్యాడు. అతని సతీమణి సారా రహీమ్ ఆదివారం పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని కేన్ విలియమ్సనే తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో పంచుకున్నాడు. సారా మొదటి బిడ్డతో పాటుగా నవజాత శిశువును పట్టుకుని ఉన్న ఫోటోను పోస్ట్ చేస్తూ.. 'లిటిల్ మ్యాన్‌కు స్వాగతం' అంటూ విలియమ్సన్ ట్వీట్ చేశాడు. 

ఐపీఎల్ 2022లో భాగంగా మే 17 రాత్రి ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్ తర్వాత సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ సారథి కేన్ విలియమ్సన్ స్వదేశానికి పయనమయ్యాడు. సతీమణి సారా రహీమ్ రెండో బిడ్డకు జన్మనివ్వాల్సి ఉండటంతో.. ప్రసవం సమయంలో ఆమె చెంత ఉండేందుకు ఉన్నపళంగా న్యూజిలాండ్‌కు బయలుదేరాడు. దాంతో మే 22న లీగ్ దశలో సన్‌రైజర్స్‌ ఆడిన చివరి మ్యాచుకు భువనేశ్వర్ కుమార్ సారథిగా ఉన్నాడు. పంజాబ్ కింగ్స్‌తో జరిగిన ఈ మ్యాచులో హైదరాబాద్ ఓడిపోయింది. 

విలియమ్సన్‌ దంపతులకు 2020 డిసెంబర్‌లో అమ్మాయి మ్యాగీ జన్మించింది. ఇప్పుడు కుమారుడు పుట్టాడు. రెండోసారి తండ్రైన కేన్ మామకు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. సురేశ్ రైనా, రషీద్ ఖాన్, జాసన్ హోల్డర్ మరియు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరులో క్రికెట్ ఆపరేషన్స్ డైరెక్టర్ మైక్ హెస్సన్‌ శుభాకాంక్షలు తెలిపారు. సన్‌రైజర్స్ హైదరాబాద్ మాజీ ప్లేయర్ డేవిడ్ వార్నర్ కూడా విలియమ్సన్‌ జంటకు శుభాకాంక్షలు తెలిపాడు.

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Kane Williamson (@kane_s_w)

ఐపీఎల్ 2022లో కేన్ విలియమ్సన్ 13 మ్యాచ్‌లు ఆడి 19.64 సగటున 93.51 స్ట్రైయిక్ రేటుతో 216 రన్స్ మాత్రమే చేశాడు. కేన్ మామ బ్యాటింగ్‌లో మాత్రమే కాకుండా కెప్టెన్సీలో కూడా విఫలమయ్యాడు. తన సారథ్యంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు 13 మ్యాచ్‌ల్లో ఆరు విజయాలు మాత్రమే అందించాడు. సన్‌రైజర్స్ లీగ్ దశలో ఆడిన 14 మ్యాచ్‌లలో 6 విజయాలు సాధించి 12 పాయింట్లతో ఎనిమిదో స్థానంలో ఉంది. 

Also Read: Monday Remedy Tips: సోమవారం ఈ పూజలు చేస్తే.. జీవితంలో డబ్బు సమస్యలు ఎప్పటికీ రావు!

Also Read: Gold Price Today: పెరుగుతున్న పసిడి ధరలకు బ్రేక్.. హైదరాబాద్‌లో నేటి బంగారం, వెండి రేట్లు ఇలా ఉన్నాయి!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

 

Trending News