MS Dhoni: ట్రంప్‌తో గోల్ఫ్ ఆడిన ఎంఎస్ ధోనీ.. నెటిజన్స్ క్రేజీ కామెంట్స్

MS Dhoni Plays Golf with Donald Trump: డొనాల్డ్ ట్రంప్‌తో కలిసి ఎంఎస్‌ ధోనీ గోల్ఫ్‌ ఆడాడు. అమెరికా ట్రిప్‌లో ఉన్న ధోనీని గోల్ప్‌ ఆడేందుకు ట్రంప్ ఆహ్వానించారు. ఇందుకు సంబంధించిన పిక్స్, వీడియోలు వైరల్ అవుతున్నాయి.   

Written by - Ashok Krindinti | Last Updated : Sep 8, 2023, 07:06 PM IST
MS Dhoni: ట్రంప్‌తో గోల్ఫ్ ఆడిన ఎంఎస్ ధోనీ.. నెటిజన్స్ క్రేజీ కామెంట్స్

MS Dhoni Plays Golf with Donald Trump: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ మూడేళ్లయినా అభిమానుల్లో ఇంకా క్రేజ్ తగ్గలేదు. ప్రస్తుతం అమెరికాలో సెలవులు ఎంజాయ్ చేస్తున్న మిస్టర్ కూల్ కెప్టెన్‌.. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో కలిసి గోల్ఫ్‌ ఆడాడు. ఇందుకు సంబంధించిన పిక్స్, వీడియోలు వైరల్ అవుతున్నాయి. వైరల్ ఫొటోలో ధోనీ, ట్రంప్ ఒకరి పక్కన మరొకరు నిలబడి కెమెరాకు పోజులు ఇచ్చారు.

అమెరికా ట్రిప్‌లో ఉన్న ధోనీని గోల్ఫ్ ఆడేందుకు ట్రంప్ ఆహ్వానించారు. ఇద్దరు కలిసి ట్రంప్ నేషనల్ గోల్ఫ్ క్లబ్ బెడ్మినస్టర్‌లో సరదాగా గోల్ఫ్ ఆడారు. ఈ ఫోటోపై ఫ్యాన్స్ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. తలా ఫీవర్ అమెరికాకు కూడా చేరిందని అంటున్నారు. డొనాల్డ్ ట్రంప్ మళ్లీ అధ్యక్షుడిగా ఎలా మారాలో మహి భాయ్ నుంచి చిట్కాలు తీసుకుంటున్నారని ఓ నెటిజన్ కామెంట్స్ చేశాడు.  

 

ధోనికి క్రికెట్ తరువాత ఎక్కువగా ఫుట్‌బాల్, టెన్నిస్, హాకీ అంటే ఇష్టం. యూఎస్‌ ఓపెన్‌లో పురుషుల సింగిల్స్ క్వార్టర్‌ ఫైనలిస్టులు కార్లోస్ అల్కరాజ్-అలెగ్జాండర్ జ్వెరెవ్‌ల మధ్య జరిగిన మ్యాచ్‌ను చూసేందుకు ఎంఎస్ ధోనీ కూడా ఆర్థర్ ఆషే స్టేడియానికి విచ్చేశాడు. ఆటగాళ్ల సిట్టింగ్ ప్రాంతం వెనుక కూర్చుని మ్యాచ్‌ను వీక్షించాడు. ధోనీ నవ్వుతూ క్వార్టర్ పోరును ఆస్వాదిస్తున్న వీడియో నెట్టింట చక్కర్లు కొట్టింది. ఈ ఏడాది చెన్నై సూపర్ కింగ్స్‌లో ఐదో ఐపీఎల్ టైటిల్ అందించిన ధోనీ.. వచ్చే సీజన్‌లో కూడా ఆడనున్నాడు. అయితే అప్పటివరకు పూర్తిగా ఫిట్‌గా ఉండాలని ధోనీ భావిస్తున్నాడు.

ఇక వచ్చే ఎన్నికల్లో అధ్యక్షుడిగా మరోసారి పోటీ చేయాలని అనుకుంటున్న ట్రంప్‌పై నాలుగోసారి ట్రంప్‌పై నేరారోపణలు వచ్చాయి. ఈ నాలుగు కేసులలో మొత్తం 91 నేరారోపణలను ఎదుర్కొంటున్నారు. యునైటెడ్ స్టేట్స్ చరిత్రలో నేరారోపణలను ఎదుర్కొన్న మొదటి మాజీ అధ్యక్షుడు ట్రంప్ కావడం గమనార్హం. ట్రంప్ జనవరి 2021లో ట్రంప్ అధికారాన్ని కోల్పోయారు. వచ్చే ఎన్నికల్లో అధ్యక్షుడి రేసులో నిలబడేందుకు ప్రయత్నిస్తున్నారు. 

Also Read: Home Guard Ravinder Death: అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన హామీ దిక్కులేదు.. సీఎం కేసీఆర్‌కు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ  

Also Read: Aadhaar Card Update: ఆధార్ కార్డ్ యూజర్లకు గుడ్‌న్యూస్.. మూడు నెలలు గడువు పెంపు  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook 

Trending News