MI vs RCB IPL 2021: ఇండియన్ ప్రీమియర్ లీగ్ రేపే ప్రారంభం కానుంది. తమ తొలి మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఢిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్‌ను ఢీకొట్టనుంది. చెన్నై వేదికగా ఐపీఎల్ 2021 తొలి మ్యాచ్ జరగనుంది. ఆర్సీబీ పేసర్, టీమిండియా క్రికెటర్ మహమ్మద్ సిరాజ్ తన జీవిత లక్ష్యమేంటన్నది వెల్లడించాడు. భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలవాలనేది తన కల అని సిరాజ్ తెలిపాడు. ఆర్సీబీ జట్టుకు పేసర్‌గా ఈ హైదరాబాదీ తన వంతు బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు.
జస్ప్రిత్ బుమ్రాకు ప్రత్యర్థిగా బరిలోకి దిగుతున్న ఆర్సీబీ పేసర్ మహమ్మద్ సిరాజ్ పలు విషయాలు షేర్ చేసుకున్నాడు. టీమిండియా తరఫున తాను బౌలింగ్ చేస్తుంటే జస్ప్రిత్ బుమ్రా తనకు మద్దతుగా నిలిచాడని, ఎటువంతి కొత్త విషయాల జోలికి వెళ్లకుండా బౌలింగ్ మూలాలు ఆధారంగా చేసుకుని బంతిని సంధించాలని తనకు సలహాలు ఇచ్చినట్లు మహమ్మద్ సిరాజ్ వెల్లడించాడు. ఐపీఎల్ 2021(IPL 2021) ప్రారంభానికి ఒకరోజు ముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ట్విట్టర్ ఖాతాలో సిరాజ్ ఓ వీడియో పోస్ట్ చేశాడు. మహమ్మద్ సిరాజ్ 2.0 అని బోల్డ్ డైరీస్ పేరుతో ఆర్సీబీ ఆ ట్వీట్‌ను అందించింది.
Also Read: ICC T20 World Cup: భారత్ వేదికగానే టీ20 వరల్డ్ కప్, ప్రత్యామ్నాయ వేదికపై యోచించని ఐసీసీ
Bold Diaries: Mohammed Siraj 2.0
Siraj talks about his Indian team debut, how he regained his confidence during last year’s IPL, goals for this season and much more, on @myntra presents Bold Diaries.#PlayBold #WeAreChallengers #IPL2021 pic.twitter.com/pcSRgy6OQu
— Royal Challengers Bangalore (@RCBTweets) April 8, 2021
గత ఏడాది ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ ద్వారా సుదీర్ఘ ఫార్మాట్లో టీమిండియా తరఫున అరంగేట్రం చేశాడు మహమ్మద్ సిరాజ్. తండ్రిని కోల్పోయిన సిరాజ్ సిడ్నీ వేదికగా ఆసీస్ అభిమానుల చేతిలో జాతి వివక్ష వ్యాఖ్యలు సైతం ఎదుర్కొన్నాడు. ఆపై భారత్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా క్వారంటైన్ పూర్తి చేసుకుని ప్రాక్టీస్ మొదలుపెట్టగా తండ్రి కున్నుమూశారనే వార్త వినాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశాడు.
కానీ ఆ సమయంలో ఏ ఒక్కరూ తన గదికి రాలేదని, ఆ తరువాత కుటుంబానికి, అమ్మకు కాల్ చేయగా వారు ఎంతో మద్దతుగా నిలిచారని గుర్తు చేసుకున్నాడు. టీమిండియా(Team India)కు ఆడాలనే నా తండ్రి కలను తీర్చాలని కుటుంబం చెప్పిందన్నాడు. ప్రస్తుతం కెరీర్ విషయానికొస్తే టీమిండియా బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ తనను కుమారుడిలా చూసుకుంటారని తెలిపాడు. లైన్ అండ్ లెంగ్త్ మీద ఫోకస్ చేయాలని బౌలింగ్ కోచ్ తనకు పదే పదే చెప్పేవారని, టీమిండియాకు మూడు ఫార్మాట్లలో ప్రాతినిథ్యం వహించాలనుందని మనసులో మాటను బహిర్గతం చేశాడు.
Also Read: Sunrisers Hyderabad Full Squad: సన్‌రైజర్స్ హైదరాబాద్ మొత్తం ఆటగాళ్లు, వారి ప్రదర్శన వివరాలు
ఐపీఎల్ 20221కు పూర్తి స్థాయిలో సన్నద్ధమయ్యాయని, ఒకే వికెట్‌తో బౌలింగ్ చేయడంతో మరింత మెరుగ్గా తయారయ్యానని మహమ్మద్ సిరాజ్ వివరించాడు. శుక్రవారం రాత్రి 7:30 గంటలకు ముంబై వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ ప్రారంభం కానుంది. డిస్నీ + హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం కానుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook