ప్రస్తుతం జరుగుతున్న రంజీ ట్రోఫి 2018-19లో భాగంగా రాజస్తాన్, జమ్ముకశ్మీర్ జట్ల మధ్య క్రికెట్ మ్యాచ్‌లో శుక్రవారం ఓ ఆసక్తికరమైన పరిణామం చోటుచేసుకుంది. జైపూర్‌లోని సవాయి మాన్ సింగ్ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో జమ్మూకాశ్మీర్‌కి చెందిన 30 ఏళ్ల పేస్ బౌలర్ మహమ్మద్ ముదాసిర్ వరుసగా నాలుగు బంతులకు నాలుగు వికెట్లు తీసి రికార్డ్ సృష్టించాడు. ఆ నాలుగు వికెట్లు కూడా ఎల్బీడబ్ల్యూ రూపంలోనే పడటంతో అతడి రికార్డుకు మరో ప్రత్యేకత సంతరించుకుంది.
మహమ్మద్ ముదాసిర్ బౌలింగ్‌లో రాజస్థాన్ ఆటగాళ్లు చేతన్ బిస్త్, తాజిందర్ సింగ్ ధిలాన్, రాహుల్ చాహర్, తన్వీర్ వరుసగా పెవిలియన్ బాటపట్టారు.