Rajasthan Royal Vs Delhi Capitals Dream 11 Fantasy Cricket Tips: శనివారం ఐపీఎల్‌లో డబుల్ ధమాకా జరగనుంది. మొదటి మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ తలపడనున్నాయి. ఈ సీజన్‌లో ఆడిన రెండు మ్యాచ్‌ల్లో రాజస్థాన్ ఒకదాంట్లో ఒక మ్యాచ్‌లో ఓడిపోయింది. అటు ఢిల్లీ ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఓటమిపాలైంది. దీంతో రెండు జట్లకు ఈ మ్యాచ్ కీలకంగా మారింది. గౌహతిలోని బరస్పరా క్రికెట్ స్టేడియంలో మధ్యాహ్నం 3.30 గంటలకు మ్యాచ్ ఆరంభంకానుంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో పటిష్టంగా ఉన్న రాజస్థాన్.. ఈ మ్యాచ్‌లో పైచేయి సాధించే అవకాశం కనిపిస్తోంది.
తొలి మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌ను 72 పరుగుల తేడాతో ఓడించిన రాజస్థాన్.. రెండో మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌పై 5 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. పంజాబ్ కింగ్స్‌పై జట్టుపై ఓడిపోయినా.. చివరివరకు గెలుపు కోసం పోరాడింది. అటు ఢిల్లీ జట్టు ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఏకపక్షంగా ఓడిపోయింది. తొలి మ్యాచ్‌లో లక్నో చేతిలో 50 రన్స్ తేడాతో ఓడిపోగా.. రెండో మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ జట్టు 6 వికెట్ల తేడాతో ఢిల్లీపై విజయం సాధించింది. రాజస్థాన్‌పై గెలుపొంది.. పాయింట్ల పట్టికలో ఖాతా ఓపెన్ చేయాలని చూస్తోంది. ఇప్పటివరకు రాజస్థాన్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు ఐపీఎల్ మొత్తం 26 సార్లు హెడ్ టు హెడ్ తలపడ్డాయి. చెరో 13 మ్యాచ్‌ల్లో విజయం సాధించాయి.
పిచ్ రిపోర్ట్..
గౌహతిలోని బర్సపరా క్రికెట్ స్టేడియం బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. రాజస్థాన్, పంజాబ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో భారీ స్కోర్లు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో మరోసారి బ్యాట్స్‌మెన్లు పండగ చేసుకునే అవకాశం ఉంది. అయితే ఫాస్ట్ బౌలర్లకు కూడా పిచ్ నుంచి సహకారం లభించనుంది. టాస్ గెలిచిన జట్టు బ్యాటింగ్ ఎంచుకునే అవకాశం కనిపిస్తోంది. గౌహతిలో వాతావరణం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. మ్యాచ్‌కు వర్షం అడ్డంకి ఉండే అవకాశాలు లేవు.
రెండు జట్ల ప్లేయింగ్‌లో 11లో పెద్దగా మార్పులు చేసే అవకాశం లేదు. రాజస్థాన్ టాప్ ఆర్డర్‌లో ఫుల్ ఫామ్‌లో ఉంది. జోస్ బట్లర్, యశస్వి జైస్వాలా, కెప్టెన్ సంజూ శాంసన్, హిట్‌మేయర్‌తో బ్యాటింగ్ ఆర్డర్ పటిష్టంగా ఉండగా.. ఢిల్లీ బ్యాట్స్‌మెన్ ఫామ్‌లేమితో ఇబ్బంది పడుతున్నారు. ఆ జట్టు కెప్టెన్ డేవిడ్ వార్నర్ ఒంటరిపోరాటం చేస్తున్నాడు. టాప్ ఆర్డర్‌లో పృథ్వీ షా, మిచెల్ మార్ష్ భారీ ఇన్నింగ్స్ ఆడాల్సి ఉంది. రిలే రోసో, సర్ఫరాజ్ ఖాన్ ఆకట్టుకునే ప్రదర్శన చేయలేదు. బౌలింగ్‌లో రెండు జట్లు బలంగా ఉన్నాయి.
రెండు జట్లు ప్లేయింగ్ 11 ఇలా.. (అంచనా)
రాజస్థాన్ రాయల్స్: జోస్ బట్లర్, యశస్వి జైస్వాల్, సంజు శాంసన్ (కెప్టెన్, వికెట్ కీపర్), దేవదత్ పడిక్కల్, షిమ్రాన్ హెట్‌మేయర్, రియాన్ పరాగ్, జేసన్ హోల్డర్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, కేఎమ్ ఆసిఫ్, యుజ్వేంద్ర చాహల్.
ఢిల్లీ క్యాపిటల్స్: డేవిడ్ వార్నర్ (కెప్టెన్), పృథ్వీ షా, మిచెల్ మార్ష్, రిలే రోసో, సర్ఫరాజ్ ఖాన్, అక్షర్ పటేల్, అభిషేక్ పోరెల్ (వికెట్ కీపర్), అమన్ హకీమ్ ఖాన్, కుల్దీప్ యాదవ్, ఎన్రిచ్ నోకియా, ముఖేష్ కుమార్.
RR vs DC డ్రీమ్ 11 టీమ్ (RR vs DC Dream 11 Team): జోస్ బట్లర్ (కెప్టెన్), డేవిడ్ వార్నర్ (వైస్ కెప్టెన్), సంజు శాంసన్, యశస్వి జైస్వాల్, మిచెల్ మార్ష్, జేసన్ హోల్డర్, అక్షర్ పటేల్, యుజ్వేంద్ర చాహల్, ట్రెంట్ బౌల్ట్, కుల్దీప్ యాదవ్, నోకియా.
Also Read: CNG PNG New Price: బిగ్ రిలీఫ్.. గ్యాస్ ధరలు తగ్గింపు.. నేటి నుంచే అమలు
Also Read: IPL 2023 CSK vs MI Playing 11: చెన్నై వర్సెస్ ముంబై ప్లేయింగ్ 11 ఇలా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి