CSK vs RR: జోస్ బట్లర్ మరో హాఫ్ సెంచరీ.. చెన్నైకు టార్గెట్ ఎంతంటే..?

CSK vs RR Match Updates: చెన్నై జట్టుపై రాజస్థాన్ టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగింది. జోస్ బట్లర్, అశ్విన్, హిట్‌మేయర్ మెరుపులు మెరిపించడంతో 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. చెన్నై జట్టు కెప్టెన్‌గా ధోనికి ఇది 200వ మ్యాచ్‌ కావడంతో ఎంతో స్పెషల్‌గా మారింది.   

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 12, 2023, 10:10 PM IST
CSK vs RR: జోస్ బట్లర్ మరో హాఫ్ సెంచరీ.. చెన్నైకు టార్గెట్ ఎంతంటే..?

CSK vs RR Match Updates: ఐపీఎల్‌ 2023లో భాగంగా చెన్నై చెపాక్‌లోని ఎంఏ చిదంబరం స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్‌, రాజస్థాన్‌ రాయల్స్‌ జట్లు పోటీ పడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి రాజస్థాన్ మొదట బ్యాటింగ్ ఆరంభించింది. రాజస్థాన్ జట్టు 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. జోస్ బట్లర్ మరోసారి హాఫ్ సెంచరీతో చెలరేగాడు. చెన్నై బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు తీయడంతో రాజస్థాన్ భారీ స్కోరుకు బ్రేకులు పడ్డాయి.
 
సూపర్ ఫామ్‌లో ఉన్న యశస్వి జైస్వాల్ (10)ను తుషార్ దేశ్‌పాండే ఔట్ చేసి చెన్నైకు బ్రేక్ ఇచ్చాడు. వన్‌డౌన్‌లో వచ్చిన దేవదత్ పడిక్కల్‌.. బట్లర్‌తో కలిసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. వీరిద్దరి జోరుతో 6 ఓవర్లలో స్కోరు 57 పరుగులకు చేరుకుంది. వీరిద్దరు రెండో వికెట్‌కు 41 బంతుల్లో 77 రన్స్ జోడించారు. 26 బంతుల్లో 38 పరుగులు చేసిన పడిక్కల్‌, కెప్టెన్ సంజూ శాంసన్‌ (0) ఒకే ఓవర్లలో రవీంద్ర జడేజా ఔట్ చేసి రాజస్థాన్‌ను దెబ్బ తీశాడు. 88 రన్స్‌కు మూడు వికెట్లు కోల్పోయింది. బ్యాటింగ్ ఆర్డర్‌లో ముందు వచ్చిన అశ్విన్ (30, 18 బంతుల్లో, 2 ఫోర్లు, 2 సిక్సర్లు) దూకుడుగా ఆడాడు. 

బట్లర్‌తో కలిసి అశ్విన్ నాలుగో వికెట్‌కు 37 బంతుల్లో 47 పరుగులు జోడించాడు. 36 బంతుల్లో 52 పరుగులు చేసిన జోస్ బట్లర్‌ను మొయిన్ అలీ పెవిలియన్‌కు పంపించాడు. చివర్లో షిమ్రాన్ హిట్‌మేయర్ చివర్లలో మెరుపులు మెరిపించాడు. 18 బంతుల్లో 30 పరుగులు చేశారు. దీంతో రాజస్థాన్ స్కోరు 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. చెన్నై బౌలర్లలో ఆకాశ్‌ సింగ్, తుషార్ దేశ్‌పాండే, రవీంద్ర జడేజా తలో రెండు వికెట్లు తీశారు. మెయిన్ ఆలీ ఒక వికెట్ పడగొట్టాడు. 176 రన్స్ టార్గెట్‌తో చెన్నై సూపర్ కింగ్స్ బరిలోకి దిగనుంది.

 

Also Read: Jos Buttler Record: జోస్ బట్లర్‌ అరుదైన రికార్డు.. ఐపీఎల్‌ చరిత్రలో మూడో ఆటగాడిగా!

చెన్నై జట్టు కెప్టెన్‌గా ధోనికి ఇది 200వ మ్యాచ్. ధోనీకి ఈ మ్యాచ్‌ను ప్రత్యేక గుర్తుగా మిగులుస్తామని రవీంద్ర జడేజా మ్యాచ్‌కు ముందు చెప్పాడు. చెపాక్‌లో చెన్నై గెలిస్తే.. తమతో పాటు అభిమానులు సంతోషంగా ఉంటారని తెలిపాడు.

Also Read: Interstate Gang: వాట్ ఏ ప్లానింగ్.. జులాయి మూవీ సీన్ రిపీట్.. తీగ లాగితే డొంకంతా బయటపడింది..!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook

 

Trending News