RCB vs SRH Highlights: ఈ ఐపీఎల్ సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ అద్భుతాలు చేసేందుకు వచ్చేసింది. ఈ లీగ్ చరిత్రలోనే అత్యధిక పరుగులు చేస్తూ తనకు తిరుగులేదని మరోసారి చాటిచెప్పింది. కొన్ని రోజుల కిందట 277 పరుగులతో అత్యధిక స్కోర్ సాధించి చరిత్ర సృష్టించగా.. తాజాగా 287 పరుగులు చేసి హైదరాబాద్ తన రికార్డును తానే బద్దలు కొట్టింది. ఫలితంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరుపై భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. బ్యాటింగ్, బౌలింగ్‌లోనూ మెరిసిన ఎస్ఆర్హెచ్ పాయింట్ల పట్టికలో ముందడుగు వేసింది. చిన్నస్వామి స్టేడియంలో బెంగళూరుపై 25 పరుగుల తేడాతో మ్యాచ్‌ను చేజిక్కించుకుంది.
Also Read: IPL Live MI vs CSK Highlights: పతిరణ దెబ్బకు ముంబై ఇండియన్స్ విలవిల.. చెన్నై భారీ విజయం
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్ పరుగుల సునామీ సృష్టించింది. ట్రావిస్ హెడ్ బ్యాటింగ్ విధ్వంసంతో 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి హైదరాబాద్ 287 పరుగులు చేసింది. అభిషేక్ శర్మ (34) పర్వాలేదనిపించగా.. ట్రావిస్ హెడ్ మాత్రం బీభత్సం సృష్టించాడు. 41 బంతుల్లో 102 పరుగులు చేసి దుమ్ము ధుళిపాడు. 9 ఫోర్లు, 8 సిక్సర్లతో రెచ్చిపోయి ఆడాడు. అనంతరం హెన్రిచ్ క్లాసెన్ (67) మరో అర్ధశతకం నమోదు చేశాడు. ఐడెన్ మార్క్రమ్ (32), అబ్దుల్ సమద్ (37) బ్యాటింగ్‌తో పరుగులు రాబట్టి జట్టు మరో చారిత్రక ఇన్నింగ్స్ నమోదు చేయడానికి దోహదం చేశారు.
ప్రమాదకర హైదరాబాద్‌ను పరుగులు తీయకుండా బెంగళూరు బౌలర్లు ఏమాత్రం నియంత్రించలేకపోయారు. అత్యంత చెత్త ప్రదర్శన కనబర్చడంతో హైదరాబాద్ మరో రికార్డు స్కోర్ సాధంచింది. నలుగురు బౌలర్లు ఒక్కొక్కరు అర్ధ శతకానికి పైగా పరుగులు సమర్పించుకున్నారు. రిక్కీ టోప్లే మాత్రం 68 ఇచ్చి ఒక వికెట్ తీశాడు. ఫక్కీ ఫర్గూసన్ 52 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు తీయడం విశేషం. విల్ జాక్స్ (32), యశ్ దయాల్ (51), వైశాక్ విజయ్ కుమార్ (64) భారీగా పరుగులు సమర్పించుకున్నారు.
నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 262 పరుగులతో బెంగళూరు తీవ్ర పోరాటం చేసి ఓటమిపాలైంది. లీగ్ చరిత్రలోనే హైదరాబాద్ మరో అత్యధిక స్కోర్ నమోదు చేయడంతో బెంగళూరు భయపడుతూనే బ్యాటింగ్‌కు దిగింది. బ్యాటింగ్ వీరుడు విరాట్ కోహ్లీ ఉన్నాడనే ధైర్యంతో ఆర్సీబీ ముందడుగు వేయగా కొండంత లక్ష్యాన్ని ఛేదించలేక చతికిలపడింది. విజయం కోసం కొంత పోరాడినా ఫలితం మాత్రం చేదు మిగిలింది. ప్రారంభం ధాటిగా మొదలైనా చివరివరకు అది కొనసాగలేకపోయింది. విరాట్ కోహ్లీ, కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ గెలుపు బాధ్యతలను మోస్తున్న విరాట్ కోహ్లీ జట్టుకు విజయం అందించలేకపోయాడు. 20 బంతుల్లో 42 పరుగులతో దూకుడుగా ఆడాడు. కానీ మయాంక్ మర్కండే మాయ చేసి కోహ్లీని గ్రౌండ్ నుంచి పంపించేయడంతో బెంగళూరు ప్రమాదంలో పడింది.
ఆ కొద్దిసేపటికి 28 బంతుల్లో 62 పరుగులు చేసి ఫాఫ్ డుప్లెసిస్ మైదానం వీడాడు. మహిపాల్ లమ్రోర్ (19), విల్ జాక్స్ (7), రజత్ పతిదార్ (9), శౌరవ్ చాహన్ (0) బ్యాటింగ్‌లో ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారు. ఆఖరులో దినేశ్ కార్తీక్ మరోసారి మెరిశాడు. జట్టుకు పరాజయం ఖరారైనా కూడా ఓటమి అంతరం తగ్గించేందుకు శ్రమించాడు. 35 బంతుల్లో 83 పరుగులు చేసి మరోసారి తన ఫామ్ నిరూపించుకున్నాడు. అనూజ్ రావత్ (25) చివర్లో మెరిశాడు. ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో ఒక్కటి నెగ్గి ఆరింట ఓడిన బెంగళూరు పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter