Pakistan Women won by 13 runs against India Women: మహిళల ఆసియా కప్ 2022లో టీమిండియాకు తొలి ఓటమి ఎదురైంది. శుక్రవారం పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచులో భారత్ ఓడిపోయింది. పాక్ నిర్ధేశించిన 138 పరుగుల సాధారణ లక్ష్య ఛేదనలో 19.4 ఓవర్లలో 124 పరుగులకే భారత్ ఆలౌటైంది. దీంతో పాక్ 13 పరుగుల తేడాతో విజయం సాధించింది. భారత బ్యాటర్లలో రిచా ఘోష్ (26) టాప్ స్కోరర్. ఈ విజయంతో పాక్ నాలుగు మ్యాచుల్లో మూడు విజయాలను సాధించింది. మరోవైపు భారత్ కూడా నాలుగు మ్యాచుల్లో మూడు విజయాలు అందుకుంది.
ఏ మ్యాచులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్తాన్ జట్టుకు శుభారంభం దక్కలేదు. ఓపెనర్లు అమీన్ (11), మునీబా అలీ (17).. ఒమైమా సోహైల్ (0) తక్కువ పరుగులకే పెవిలియన్ చేరారు. ఈ సమయంలో నిదా దార్ (56; 37 బంతుల్లో 5 ఫోర్లు, ఓ సిక్స్), మారూఫ్ (32) జట్టును ఆదుకున్నారు. ఈ ఇద్దరి నిష్క్రమణ అనంతరం మిగతా బాటర్లు పెద్దగా ఆకట్టుకోలేదు. దాంతో పాక్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 137 రన్స్ చేసింది. భారత బౌలర్లు దీప్తి శర్మ 3, పూజా వస్త్రాకర్ 2 వికెట్లు పడగొట్టారు.
A close contest but it is Pakistan who win the game.#TeamIndia will look to bounce back in their next encounter 👍🏻
Scorecard ▶️ https://t.co/Q9KRCvhtzz…#INDvPAK | #AsiaCup2022 pic.twitter.com/VDchyPQ5bU
— BCCI Women (@BCCIWomen) October 7, 2022
138 పరుగుల లక్ష్య ఛేదనలో ఆరంభం దక్కలేదు. సబ్భినేని మేఘన (15), స్మృతి మంధాన (17), జెమిమా రోడ్రిగ్స్ (2), పూజా వస్త్రాకర్ (5) త్వరగానే ఔట్ అయ్యారు. దాంతో భారత్ కష్టాల్లో పడింది. టాప్ బ్యాటర్ల నిష్క్రమణ అనంతరం భారత్ ఏ దశలోనూ లక్ష్యం దిశగా సాగలేదు. దయాలన్ హేమలత (20), దీప్తి శర్మ (16), హర్మన్ ప్రీత్ కౌర్ (12) పోరాడినా ఫలితం లేకుండా పోయింది. పాక్ బౌలర్లలో నస్రా సంధు 3, సాదియా ఇక్బాల్ 2, నిదా దార్ 2 వికెట్లు పడగొట్టారు.
Also Read: మీదికి దూసుకొచ్చిన 14 అడుగుల కింగ్ కోబ్రా.. ఈ వ్యక్తి ఎలా డీల్ చేశాడో చూడండి!
Also Read: వైరల్ వీడియో.. బుసలు కొడుతున్న కింగ్ కోబ్రాను ఎంత ఈజీగా పట్టాడో చూడండి!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook