Binura Fernando Takes Sensational Catch To Dismiss Sanju Samson: క్రికెట్ ఆటలో అప్పుడప్పుడూ కొన్ని అరుదైన, అద్భుతమైన సంఘటనలు చోటుచేసుకుంటాయి. కొన్నిసార్లు ఎవరూ ఊహించని రీతిలో బ్యాటర్ పెవిలియన్ బాట పడుతుంటాడు. ఎక్కువ శాతం ఫీల్డర్లు తమ ఫీల్డింగ్ విన్యాసాలతో అద్భుతమైన క్యాచ్‌లు పట్టడంతోనే బ్యాటర్ ఆశ్చర్యకరంగా నిష్క్రమించాల్సి వస్తుంది. ఇప్పటికే ఎన్నో స్టన్నింగ్ క్యాచ్‌లను మనం చూసే ఉంటాం. తాజాగా భారత్, శ్రీలంక జట్ల మధ్య జరుగుతున్న టీ20 సిరీస్‌లో ఓ అద్భుత క్యాచ్ నమోదైంది. లంక ఆటగాడు బినురా ఫెర్నాండో సూపర్ మ్యాన్‌లా గాల్లోకి ఎగిరి ఒంటిచేత్తో అద్భుతంగా క్యాచ్ అందుకున్నాడు.
ధర్మశాల వేదికగా శనివారం శ్రీలంకతో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో భారత్ చేధనకు దిగిన విషయం తెలిసిందే. ఓపెనర్లు రోహిత్ శర్మ (1), ఇషాన్ కిషన్ (16)లను లంక త్వరగానే ఔట్ చేయడంతో భారత్ కష్టాలో పడింది. ఈ సమయంలో శ్రేయస్ అయ్యర్ (74 నాటౌట్; 44 బంతుల్లో 6×4, 4×6), సంజు శాంసన్ (39; 25 బంతుల్లో 2×4, 3×6)లు జట్టును ఆదుకున్నారు. శ్రేయాస్, శాంసన్ ధాటిగా ఆడడంతో భారత్ స్కోర్ పరుగులు పెట్టింది. లహిరు కుమార వేసిన ఇన్నింగ్స్ 13వ ఓవర్లో శాంసన్ మూడు సిక్స్‌లు, ఫోర్‌తో చెలరేగిపోయాడు.
లాహిరు కుమార వేసిన 13వ ఓవర్ చివరి బంతికి సంజు శాంసన్ భారీ షాట్‌కు ప్రయత్నించాడు. బంతి బ్యాట్ ఎడ్జ్ తీసుకుని షార్ట్ థర్డ్‌మెన్ దిశగా దూసుకెళ్లింది. అక్కడ ఫీల్డింగ్ చేస్తున్న బినురా ఫెర్నాండో మీదుగా బాల్ వెళుతుండగా.. అతడు ఒక్కసారిగా పక్షిలా గాల్లోకి ఎగిరి ఒంటిచేత్తో స్టన్నింగ్ క్యాచ్ పట్టాడు. దీంతో 39 పరుగుల వద్ద శాంసన్ పెవిలియన్‌కు చేరక తప్పలేదు. కస్టమైన క్యాచ్ పట్టడంతో ఫెర్నాండోను సహచరులు ప్రశంసించారు.
Binura Fernando 💥🤯
WHAT A CATCH....😱#INDvSL pic.twitter.com/5ymg7mzYle— Sandalu Gaganaka ✨ (@gaganaka49) February 26, 2022
బినురా ఫెర్నాండో పట్టిన క్యాచ్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. క్యాచ్ పట్టిన సమయంలో కామెంటేటర్లు కూడా స్టన్నింగ్ క్యాచ్ అంటూ పొగిడారు. ఈ వీడియో చూసిన ఫాన్స్.. 'స్టన్నింగ్ క్యాచ్' అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. 'వాట్ ఏ క్యాచ్', 'సూపర్ ఫీల్డింగ్', టేక్ ఏ బో' అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇక ఆలస్యం ఎందుకు ఈ క్యాచ్ వీడియోను మీరూ చూడండి. రెండో టీ20లో భారత్ 7 వికెట్ల తేడాతో శ్రీలంకపై ఘనవిజయం సాధించింది. 184 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 17.1 ఓవర్లలో కేవలం మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది.
Also Read: Salman Khan Pooja Hegde: సల్మాన్ భాయ్.. ఏంటా చిలిపి పని! పూజా హెగ్డేను ఏం చేస్తున్నావ్! (వీడియో)
Also Read: Dhoni New Look: నయా లుక్‌లో ధోనీ.. ఎవరూ గుర్తుపట్టలేనంతగా!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook