Nitish Reddy: నితీశ్‌రెడ్డిని తొక్కేస్తున్నారా? ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌లో ఏం జరగబోతుంది?

Nitish Reddy: ఇంగ్లండ్‌తో జరగనున్న టీ20 సిరీస్‌లో నితీశ్‌రెడ్డికి తుది జట్టులో ఆడే ఛాన్స్ రావడం కష్టంగానే కనిపిస్తోంది. ఎందుకంటే ఫాస్ట్‌ బౌలింగ్‌-ఆల్‌రౌండర్‌ కోటాలో హార్దిక్‌పాండ్యావైపే టీమ్‌ మేనేజ్‌మెంట్‌ మొగ్గు చూపే అవకాశముంది. దీంతో తెలుగు క్రికెట్‌ ఫ్యాన్స్‌ నిరాశ చెందుతున్నారు.

Written by - Bhoomi | Last Updated : Jan 15, 2025, 06:37 PM IST
Nitish Reddy: నితీశ్‌రెడ్డిని తొక్కేస్తున్నారా? ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌లో ఏం జరగబోతుంది?

Nitish Reddy: ఏంటో ప్రతీసారి నితీశ్‌రెడ్డినే కనిపిస్తాడా? ఆస్ట్రేలియా సిరీస్‌లో కూడా అంతే.. ఎవరినైనా పక్కన పెట్టాలి అంటే వెంటనే టీమ్‌ మేనేజ్‌మెంట్ నితీశ్‌రెడ్డి వైపు చూసింది. ఇప్పుడు ఇంగ్లండ్‌తో జరగనున్న టీ20 సిరీస్‌లోనూ నితీశ్‌ను పక్కన పెట్టాలని ఆలోచిస్తున్నారట. ఆల్‌రౌండర్‌గా హార్దిక్‌ పాండ్యా ఉండడంతో మరో ఆల్‌రౌండర్ ప్లేయింగ్‌-11లో ఎందుకని గంభీర్‌ భావిస్తున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. అదేంటో అర్థంకాదు కానీ చాలా జట్లలో ఫేస్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్లు ప్లేయింగ్‌-11లో ఒకరే ఉండాలనే నిబంధన ఏమీ ఉండదు. టీమిండియా మాత్రం ప్రతీసారి వన్‌-ఆల్‌రౌండర్‌ విధానంతో ముందుకు వెళ్తుంటుంది. నిజానికి ఏ జట్టుకైనా ఆల్‌రౌండర్‌ ఉండడం వరం. ఎందుకంటే బ్యాటింగ్‌, బౌలింగ్‌ రెండూ చెయగలరు. మరి అలాంటోళ్లు ఎక్కువ మంది ఉంటే నష్టమేంటో!

జనవరి 22న కోల్‌కతా వేదికగా ఇంగ్లండ్‌తో తొలి టెస్టు జరగనుంది. సూర్యకుమార్ యాదవ్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఈ సిరీస్‌ ద్వారా మహమ్మద్ షమీ రీఎంట్రీ ఇవ్వనున్నాడు. ఇక ఇటివలీ మూడు సెంచరీలతో సూపర్బ్‌ టచ్‌లో ఉన్న సంజూ శాంసన్ ఓపెనర్‌గా బరిలోకి దిగనున్నాడు. మరో ఓపెనర్‌గా సన్‌రైజర్స్‌ స్టార్ ప్లేయర్ అభిషేక్ శర్మ ఉన్నాడు. మూడో స్థానంలో తెలుగు కుర్రాడు తిలక వర్మ టీమిండియాకు స్పెషల్‌ అసెట్‌ కానున్నాడు. గత సౌతాఫ్రికా పర్యటనలో తిలక్ వర్మ రెండు సెంచరీలు చేశాడు. ఆ తర్వాత నాలుగో నంబర్‌ బ్యాటర్‌గా సూర్యకుమార్ యాదవ్ వస్తాడు.  ఆ వెంటనే హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్ ఐదు, ఆరో స్థానాల్లో బ్యాటింగ్‌కు వస్తారు. అటు వైస్‌కెప్టెన్‌ అక్షర్ పటేల్ జట్టులో ఉండడం ఖాయం. అతను అందులోనూ స్పిన్‌ ఆల్‌రౌండర్‌. 

Also Read: Free Current: దేశ ప్రజలకు మోదీ సర్కార్ గుడ్ న్యూస్..ఉచిత కరెంట్ స్కీముకు దరఖాస్తు చేసుకోండిలా  

మరోవైపు రెండో స్పిన్ ఆల్‌రౌండర్‌గా వాషింగ్టన్ సుందర్‌ ఎలాగో ఉన్నాడు. ఇక రవి బిష్ణోయ్‌ లేదా వరుణ్ చక్రవర్తీలో ఒకరు మూడో స్పిన్నర్‌గా బాధ్యతలు తీసుకుంటారు. ఇక మహమ్మద్ షమీ, అర్ష్‌దీప్‌ సింగ్‌తో పేస్‌ బౌలింగ్‌ బలంగా కనిపిస్తోంది. ఒకవేళ ముగ్గురు స్పిన్నర్లు వద్దు అనుకుంటే మరో పేసర్‌గా హర్షిత్ రాణాను తీసుకోవచ్చు. ఇలా చూస్తే నితీశ్‌ రెడ్డి బెంచ్‌కే పరిమితమయ్యే ఛాన్స్ కనిపిస్తోంది.

Also Read:Gold Rate Today: కనుమ రోజు కనికరించిన పసిడి.. దిగొచ్చిన బంగారం ధరలు.. తులం ఎంత తగ్గిందంటే?  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News