IND vs ENG 01st Test Live Score : హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్ లో టీమిండియా స్పిన్నర్ల ధాటికి 246 పరుగులకే కుప్పకూలింది ఇంగ్లీష్ జట్టు. కెప్టెన్ స్టోక్స్(70) ఒక్కడే టాప్ స్కోరర్. భారత బౌలర్లలో జడేజా మూడు, అశ్విన్, అక్షర్ పటేల్, బుమ్రా రెండేసి వికెట్లు పడగొట్టారు.
టాస్ గెలిచి స్టోక్స్ సేన బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లు జాక్ క్రాలే(18), బెన్ డకెట్(35) తొలి వికెట్ కు 55 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అయితే ప్రమాదకరంగా మారుతున్న జోడిని అశ్విన్ విడదీశాడు. అశ్విన్ తన రెండో ఓవర్లో డకెట్‌ను ఎల్బీడబ్ల్యూ రూపంలో పెవిలియన్ కు పంపాడు. కాసేపటికే జడేజా అద్భుతమైన డెలివరీతో ఓలీ పోప్(1)ను బోల్తా కొట్టించాడు. దాంతో 58 పరుగుల వద్ద ఇంగ్లాండ్ రెండో వికెట్ ను కోల్పోయింది. ఆ తర్వాత మరో ఓపెనర్ జాక్ క్రాలే(20) అశ్విన్ బౌలింగ్‌లో సిరాజ్ అద్భుతమైన క్యాచ్ పట్టడంతో పెవిలియన్ చేరాడు.
స్టోక్స్ ఒక్కడే..
అనంతరం క్రీజులోకి వచ్చిన జో రూట్ కు జతకలిసిన బెయిర్ స్టో ఆతితూచి ఆడుతూ స్కోరు బోర్డును పరుగులెత్తించాడు. కుదురుకుంటున్న ఈ జోడిని అక్షర్ పటేల్ విడదీశాడు. 124 పరుగుల వద్ద బెయిర్ స్టో ను అవుట్ చేశాడు. కాసేపటికే రూట్ కూడా జడేజాకు చిక్కాడు. స్టోక్స్ ఒక్కడే చివరి బ్యాటర్లును అడ్డుపెట్టుకుని ఒంటరి పోరాటం చేశాడు. అతడికి హార్టేలే సహకరించాడు. చివరి వికెట్ గా స్టోక్స్ వెనుదిరిగడంతో ఇంగ్లీష్ జట్టు కథ ముగిసింది.
జైస్వాల్ దూకుడు..
అనంతరం బ్యాటింగ్ కు దిగిన టీమిండియా దూకుడుగా ఆడుతోంది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఫోర్లు, సిక్సర్లతో విరుచుకు పడుతున్నాడు. మరోవైపు రోహిత్ కూడా బాగానే ఆడాడు. అయితే 24 పరుగులు చేసిన హిట్ మ్యాన్ ను లీచ్ ఔట్ చేశాడు. జైస్వాల్ కు గిల్ జతకలిసాడు. గిల్ నెమ్మదిగా ఆడుతుంటే.. జైస్వాల్ బౌండరీలు బాదుతున్నాడు. ఈ క్రమంలో అతడు తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకుని సెంచరీతో దిశగా సాగుతున్నాడు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 23 ఓవర్లలో వికెట్ నష్టానికి 119 పరుగులు చేసింది. జైస్వాల్, గిల్ క్రీజులో ఉన్నారు.
Also Read: IND vs ENG 01st Test: సిరాజ్ అద్భుతమైన క్యాచ్.. మూడో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్..
Also Read: ICC Awards: చరిత్ర సృష్టించిన సూర్య భాయ్.. వరుసగా రెండోసారి ఐసీసీ అవార్డుకు ఎంపిక..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి