IND vs NED, India Bowling Coach Paras Mhambrey about Hardik Pandya Injury: టీ20 ప్రపంచకప్ 2022లో భాగంగా గత ఆదివారం పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ చిరస్మరణీయ విజయం సాధించిన విషయం తెలిసిందే. చివరి బంతి వరకు ఉత్కంఠంగా జరిగిన మ్యాచ్‌లో ఊహించని విజయాన్ని అందుకున్న భారత్.. 2 పాయింట్లను ఖాతాలో వేసుకుని సెమీస్ వైపు అడుగులేసింది. గురువారం నెదర్లాండ్స్‌తో భారత్ ఢీ కొట్టనుంది. మ్యాచ్‌కు స్టార్ ప్లేయర్ హార్దిక్ పాండ్యా దూరం కానున్నాడని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ వార్తలపై భారత బౌలింగ్ కోచ్ పారస్ మాంబ్రే స్పందించాడు.
మ్యాచ్ ఆడేందుకు హార్దిక్ పాండ్యా అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నాడని బౌలింగ్ కోచ్ పారస్ మాంబ్రే వెల్లడించాడు. 'నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌కు ఎవరికీ విశ్రాంతిని ఇవ్వడం లేదు. మెగా టోర్నీలో మేము ఇదే జోరు కొనసాగించాలనుకుంటున్నాం. ఫామ్‌లో ఉన్నవాళ్లు తప్పకుండా జట్టులో ఉంటారు. తొలి విజయం ఇచ్చిన జోష్‌తో మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతాం. హార్దిక్ పాండ్యా జట్టులో కీలక సభ్యుడు. మెగా టోర్నీలో అన్ని మ్యాచ్‌లు ఆడతాడు' అని పారస్ పేర్కొన్నాడు.
స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (82 నాటౌట్; 53 బంతుల్లో 6×4, 4×6) పాకిస్థాన్‌పై చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడిన విషయం తెలిసిందే. కోహ్లీ సహా హార్దిక్ పాండ్యా (40; 37 బంతుల్లో 1×4, 2×6) కీలక ఇన్నింగ్స్ ఆడి జట్టు విజయంలో పాలుపంచుకున్నాడు. మ్యాచ్ ముగిసే సమయంలో హార్దిక్ కండరాల నొప్పితో ఇబ్బందికి గురైనట్లు సమాచారం. ఈ నేపథ్యంలో తదుపరి మ్యాచ్‌కు విశ్రాంతిని ఇవ్వాలని టీం యాజమాన్యం భావించినట్లు వార్తలు వచ్చాయి. పాండ్యాకు విశ్రాంతినిచ్చి దీపక్ హుడాకు ఛాన్స్ ఇస్తారనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ వార్తలకు బౌలింగ్ కోచ్ పారస్ మాంబ్రే చెక్ పెట్టాడు.
Also Read: భారత జట్టులో ఉన్న ఏకైక సమస్య అదే.. హుడాకు అవకాశం ఇస్తే సరిపోద్ది: గవాస్కర్
Also Read: Budh Gochar 2022: బుధ గ్రహ సంచారం.. ఈ రోజు నుంచి ఈ మూడు రాశుల వారు కుబేరులు అవుతారు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook