IND vs BAN 1st Innings Updates: వరల్డ్ కప్‌లో మరో విజయంపై కన్నేసిన భారత్.. బంగ్లాదేశ్‌ను ఓ మోస్తరు స్కోరుకే కట్టడి చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఆరంభించిన బంగ్లా.. నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 256 పరుగులు చేసింది. తాంజిద్ హసన్ (51), లిటన్ దాస్ (66), ముష్ఫికర్ రహీమ్ (38), మహ్మదుల్లా (46) రాణించారు. టీమిండియా బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, రవీంద్ర జడేజా తలో రెండు వికెట్లు తీశారు. శార్దుల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్‌లు చెరో వికెట్ పడగొట్టారు. 257 పరుగుల లక్ష్యంతో భారత్ బరిలోకి దిగనుంది.
మొదట బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్‌కు శుభారంభం లభించింది. ఓపెనర్లు తాంజిద్ హసన్, లిటన్ దాస్ తొలి వికెట్‌కు 14.4 ఓవర్లలో 93 పరుగులు గట్టి పునాది వేశారు. ఈ శుభారంభాన్ని బంగ్లా బ్యాటర్లు సద్వినియోగం చేసుకోలేకపోయారు. 93-0 పరుగులు ఉన్న బంగ్లా.. భారత బౌలర్లు చెలరేగడంతో 137 పరుగులకు నాలుగు వికెట్లు కోల్పోయింది. దీంతో 300 పరుగులు స్కోరు చేస్తుందని బంగ్లా ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. టీమిండియా బౌలర్ల క్రమం తప్పకుండా వికెట్లు తీయడంతో బంగ్లాకు కోలుకునే అవకాశం రాలేదు. చివర్లో మహ్మదుల్లా వేగంగా ఆడాడు. దీంతో జట్టు స్కోరు 250 దాటింది.
ఇక ఈ మ్యాచ్‌లో భారత్‌కు కోలుకోలేని దెబ్బ తగిలింది. టీమిండియా స్టార ఆల్‌రౌంటర్ హార్థిక్ పాండ్యా గాయం కారణంగా కేవలం మూడు బంతులు వేసి మైదానం నుంచి బయటకు వెళ్లిపోయాడు. ఇన్నింగ్స్ 9వ ఓవర్‌లో మూడో బంతిని పాండ్యా వేయగా.. లిటన్ దాస్ స్ట్రైట్ డ్రైవ్ ఆడాడు. పాండ్యా కాలితో ఆపేందుకు ప్రయత్నించి కిందపడ్డాడు. దీంతో చీలమండ గాయంతో గ్రౌండ్‌ను వీడాడు. మిగిలిన మూడు బంతులను విరాట్ కోహ్లీ పూర్తి చేశాడు. ప్రస్తుతం పాండ్యా గాయం తీవ్రతను పరిశీలిస్తున్నామని.. స్కానింగ్ నిర్వహిస్తున్నట్లు బీసీసీఐ వెల్లడించింది. పాండ్యా బ్యాటింగ్‌కు కూడా వచ్చేది అనుమానంగా మారింది.
ప్రస్తుతం పాయింట్ల పట్టికలో టీమిండియా రెండో స్థానంలో ఉంది. ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను ఓడిస్తే.. అగ్రస్థానానికి చేరుకోవచ్చు. న్యూజిలాండ్ 4 మ్యాచ్‌ల్లో 8 పాయింట్లతో పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్‌లో ఉంది. మూడు విజయాలు సాధించిన భారత్ ఖాతాలో 6 పాయింట్లు ఉన్నాయి. బంగ్లాదేశ్ రెండు పాయింట్లతో ఆరో స్థానంలో ఉంది.
ఇది కూడా చదవండి: Cyclone Alert: బంగాళాఖాతంలో తుపాను ముప్పు, ఏపీలో ఇక వర్షాలు
ఇది కూడా చదవండి: 7th Pay Commission DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు దసరా గిఫ్ట్.. డీఏ పెంపునకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Faceboo