ICC World Test Championship 2023: ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ రేసులో టీమిండియా మరింత ముందుకు దూసుకెళ్లింది. ఆసీస్‌పై వరుసగా రెండు టెస్టులు గెలిచిన భారత్.. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో ఫైనల్ బెర్త్ దాదాపు ఖాయం చేసుకుంది. మిగిలిన రెండు టెస్టుల్లో ఒకటి గెలిచినా ప్లేస్ కన్ఫార్మ్ అయిపోతుంది. ప్రస్తుతం రేసులో ఆస్ట్రేలియా జట్టు మొదటి స్థానంలో ఉండగా.. టీమిండియా రెండో స్థానంలో ఉంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్ జూన్ 7 నుంచి 11వ తేదీ వరకు లండన్‌లోని ఓవల్ క్రికెట్ గ్రౌండ్‌లో జరుగనుంది. ఈ ఫైనల్ మ్యాచ్ కోసం రిజర్వ్ డే (జూన్ 12)ను కూడా ఉంచారు.
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా నాలుగు టెస్టుల సిరీస్‌లో తొలి రెండు టెస్టుల్లో ఆసీస్‌ను ఈజీగా చిత్తు చేసింది టీమిండియా. దీంతో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో 64.06 శాతం పాయింట్లతో రెండోస్థానాన్ని మరింత పటిష్టం చేసుకుంది. ప్రస్తుతం ఫైనల్ రేసులో ఆస్ట్రేలియా, భారత్‌తో పాటు శ్రీలంక కూడా ఉంది. ఢిల్లీ టెస్టు విజయంతో దక్షిణాఫ్రికా ఆశలు గల్లంతయ్యాయి.
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2021-23లో భారత్, ఆస్ట్రేలియా జట్లే తలపడే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ రెండు జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరిగుతుందని 88.9% మంది అంచనా వేశారు. ఆస్ట్రేలియా, శ్రీలంక మధ్య ఫైనల్ మ్యాచ్ జరుగుతుందని 8.3 శాతం, భారత్, శ్రీలంక జట్లు ఫైనల్ మ్యాచ్ ఆడతాయని 2.8 శాతం అంచనా వేశారు.
భారత్‌కు ఫైనల్‌కు చేరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి
ఆస్ట్రేలియాతో జరిగిన రెండు టెస్టుల్లో విజయాలు సాధించడం ద్వారా భారత్ రెండో డబ్యూటీసీ ఫైనల్‌కు చేరువైంది. గత టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో కూడా టీమిండియా ఫైనల్‌కు చేరింది. ట్రోఫీ భారత్‌దే అని అందరూ అంచనా వేయగా.. ఫైనల్ మ్యాచ్‌లో అనూహ్యంగా ఓటమిపాలై అభిమానులకు నిరాశకు గురిచేసింది. ఈసారి ఎలాగైనా కప్ ముద్దాడాలని టీమిండియా ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. చివరి రెండు టెస్టుల్లో ఆసీస్‌ను చిత్తు చేసి.. సిరీస్ క్లీన్‌స్వీప్ చేయడంతోపాటు డబ్యూటీసీ ఫైనల్‌లో బెర్త్ కన్ఫర్మ్ చేసుకుంటుందని నమ్మకంతో ఉన్నారు.
Also Read: Cheteshwar Pujara: పుజారా కోసం రోహిత్ శర్మ వికెట్ త్యాగం.. వందో టెస్టులో ప్రత్యేకం
Also Read: IND Vs AUS: ఆసీస్‌కు చుక్కలు చూపించిన జడేజా.. టీమిండియా సూపర్ విక్టరీ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి