Champions Trophy 2025 India Squad: ఫిబ్రవరి 19 నుంచి మార్చ్ 9 వరకు జరగనున్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో తొలి మ్యాచ్ ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్‌తో తలపడనుంది. దుబాయ్ వేదికగా ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ ఫిబ్రవరి 23న జరగనుంది. ఈ ట్రోఫీలో సెమీ ఫైనల్, ఫైనల్ మ్యాచ్‌లు అన్నీ దుబాయ్ వేదికగా జరగనుంది. ఈ ట్రోఫీకు టీమ్ ఇండియా ప్లేయింగ్ 11 అంచనాలు ఇలా ఉన్నాయి.
ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్ శుభమన్ గిల్ ఓపెనింగ్ చేయనున్నారు. యశస్వి జైస్వాల్ ప్లేయింగ్ 11 లో ఉండే అవకాశం కన్పించడం లేదు. ఇక నెంబర్ 3 స్థానంలో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ బరిలో దిగనున్నాడు. 295 వన్డేల్లో 13,906 పరుగులు సాధించిన కోహ్లీ ఇన్నింగ్స్‌లో 50 సెంచరీలు, 72 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక శ్రేయస్ అయ్యర్ నాలుగో స్థానంలో రానున్నాడు. 62 వన్డేలు ఆడిన శ్రేయస్ అయ్యర్ 2421 పరుగులు నమోదు చేశాడు. నెంబర్ 5 స్థానంలో కీపర్ కమ్ బ్యాటర్ కేఎల్ రాహుల్ దిగనున్నాడు. కేఎల్ రాహుల్‌కు అవకాశం లభిస్తే రిషభ్ పంత్‌ను ప్లేయింగ్ 11 నుంచి తొలగించవచ్చు.
ఇక ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా 6వ స్థానంలో బరిలో దిగనున్నాడు. అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్ రెండింటిలోనూ దిట్ట కావడంతో ప్లేయింగ్ 11లో కచ్చితంగా ఉంటాడు. ఇక 7వ స్థానం నుంచి బౌలర్లు ఉంటారు. స్పిన్ విభాగంలో రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్ ఉంటారు. జడేజా బ్యాటింగ్‌లో కూడా అద్భుత ప్రదర్శన చూపించగలడు. ఇక పేసర్లుగా మొహమ్మద్ షమి, జస్ప్రీత్ బూమ్రా, అర్షదీప్ సింగ్ ఉంటారు.
ఛాంపియన్స్ ట్రోపీలో ఇండియా తొలి మ్యాచ్ ఫిబ్రవరి 20న దుబాయ్ వేదికగా మద్యాహ్నం 2.30 గంటలకు ప్రారంభమౌతుంది. ఫిబ్రవరి 23న పాకిస్తాన్‌తో, మార్చ్ 2న న్యూజిలాండ్‌తో జరగనుంది. మార్చ్ 4,5 తేదీల్లో సెమీ ఫైనల్ మ్యాచ్‌లు ఉంటాయి. 9వ తేదీన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ ఉంటుంది.
టీమ్ ఇండియా ప్లేయింగ్ 11
రోహిత్ శర్మ, శుభమన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, హార్ధిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మొహమ్మద్ షమి, అర్షదీప్ సింగ్, జస్ప్రీత్ బూమ్రా
Also read: Dhoni Political Entry: రాజకీయాల్లో ఎంట్రీ ఇవ్వనున్న ధోనీ, ఎక్కడి నుంచంటే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి