Gongadi Trisha: చరిత్ర సృష్టించిన తెలుగు అమ్మాయి.. అండర్-19 వరల్డ్ కప్‌లో తొలి శతకం నమోదు

India U19 vs Scotland U19 Match Updates: అండర్-19 మహిళల వరల్డ్‌ కప్‌లో టీమిండియా అదిరిపోయే ఆటతీరుతో దుమ్ములేపుతోంది. ముఖ్యంగా తెలుగు అమ్మాయి గొంగడి త్రిష సూపర్‌ ఫామ్‌ను కంటిన్యూ చేస్తూ.. మహిళల అండర్-19 వరల్డ్ కప్‌లో శతకం బాదిన తొలి ప్లేయర్‌గా రికార్డు సృష్టించింది.  

Written by - Ashok Krindinti | Last Updated : Jan 28, 2025, 02:39 PM IST
Gongadi Trisha: చరిత్ర సృష్టించిన తెలుగు అమ్మాయి.. అండర్-19 వరల్డ్ కప్‌లో తొలి శతకం నమోదు

India U19 vs Scotland U19 Match Updates: అండర్-19 మహిళల వరల్డ్‌ కప్‌లో తెలుగు అమ్మాయి గొంగడి త్రిష సరికొత్త రికార్డు సృష్టించింది. స్కాట్లాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కేవలం 59 బంతుల్లో 13 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 110 పరుగులతో నాటౌట్‌గా నిలిచింది. అండర్ 19 మహిళల టీ20 వరల్డ్ కప్ హిస్టరీలో శతకం బాదిన తొలి బ్యాటర్‌గా చరిత్ర లిఖించింది. కౌలాలంపూర్‌లోని బయుమాస్ ఓవల్‌లో బుధవారం స్కాట్లాండ్‌తో జరిగిన పోరులో మొదట బ్యాటింగ్ చేసిన భారత్.. నిర్ణీత 20 ఓవర్లలో వికెట్ నష్టానికి 20 ఓవర్లలో వికెట్ నష్టానికి 208 రన్స్ చేసింది. గొంగడి త్రిష సెంచరీకి తోడు మరో ఓపెనర్ కమిలిని (51) అర్థ శతకం చేసింది. వీరిద్దరు తొలి వికెట్‌కు 147 పరుగులు జోడించడం విశేషం. వన్‌డౌన్ బ్యాటర్ సానికా చల్కే (29 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడి.. త్రిషకు చక్కటి సహకారం అందించింది.

జనవరి 2023లో పోచెఫ్‌స్ట్రూమ్‌లో ఐర్లాండ్‌పై ఇంగ్లాండ్ బ్యాటర్ గ్రేస్ స్క్రివెన్స్ 93 పరుగుల రికార్డును త్రిష అధిగమించింది. ఈ వరల్డ్ కప్‌లో టాప్‌ పర్ఫామర్మ్‌గా ఆమె నిలిచింది. ఐదు మ్యాచ్‌లలో త్రిష 53 సగటు, 120.45 స్ట్రైక్ రేట్‌తో 230 పరుగులు చేసింది. త్రిష మరో 68 పరుగులు చేస్తే.. మరో రికార్డును అందుకుంటుంది. మహిళల U19 T20 ప్రపంచకప్‌ ఒక ఎడిషన్‌లో అత్యధిక పరుగులు చేసిన శ్వేతా సెహ్రావత్ (297) రికార్డును అధికమిస్తుంది. ఈ వరల్డ్ కప్‌లో త్రిష తరువాత ఇంగ్లండ్‌కు చెందిన డేవినా సారా టి పెర్రిన్ నాలుగు మ్యాచ్‌ల్లో 131 పరుగులతో రెండో స్థానంలో ఉంది. 

ఈ నెల 19న వెస్టిండీస్‌తో జరిగిన భారత్ తొలి మ్యాచ్‌లో కేవలం 4 పరుగులు మాత్రమే చేసిన త్రిష.. మలేషియాతో జరిగిన రెండో మ్యాచ్‌లో 27 పరుగులతో అజేయంగా  నిలిచింది. భారత్ 32 పరుగుల లక్ష్యాన్ని అలవోకగా ఛేదించింది. శ్రీలంకతో జరిగిన మూడో మ్యాచ్‌లో త్రిష 49 పరుగులతో రాణించింది. బంగ్లాదేశ్‌పై 40 పరుగులు చేయడంతో టీమిండియా ఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇవాళ స్కాట్లాండ్‌తో శతకం బాది సరికొత్త రికార్డును సృష్టించింది. బ్యాటింగ్‌లో శతకం బాదిన త్రిష.. బౌలింగ్‌లోనూ మెరుపులు మెరిపించింది. మూడు వికెట్లు పడగొట్టింది. 

భారత్ విధించిన 209 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన స్కాట్లాండ్ కేవలం 58 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో భారత్ 150 పరుగుల తేడాతో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. కేవలం 14 ఓవర్లలోనే టీమిండియా ఆలౌట్ చేసింది. ఆయూషీ శుక్లా నాలుగు వికెట్లతో చెలరేగింది. వైష్టవి వర్మ, త్రిష చెరో మూడు వికెట్లు పడగొట్టారు. మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్ అవార్డు త్రిషకే దక్కింది.

Also Read: Mutton Biryani: పెళ్లి విందులో 'మటన్‌ బిర్యానీ' లొల్లి.. ఆగిపోయిన రిసెప్షన్‌ వేడుక

Also Read: Mauni Amavasya: కుంభమేళాకు వెళ్లలేకపోతున్నారా..? ఇవి చేస్తే కుంభమేళాకు వెళ్లినంత పుణ్యఫలం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News