Disney+Hotstar India Desk Top and Mobile App is down for 45 mins during IND vs AUS 2nd Test: ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫాం డిస్నీ+ హాట్‌స్టార్‌లో అవాంతరం తలెత్తింది. హాట్‌స్టార్ యాప్, వెబ్సైట్ ఓపెన్ చేస్తుంటే ఎర్రర్ మెసేజ్ వచ్చింది. భారతదేశంలోని 500 మందికి పైగా హాట్‌స్టార్ యాప్, వెబ్సైట్ సేవల్లో అంతరాయం ఏర్పడింది. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2023లో భాగంగా ఢిల్లీ వేదికగా భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య రెండో టెస్ట్ జరుగుతున్న సమయంలో ఈ అంతరాయం ఏర్పడింది. దాంతో క్రికెట్ అభిమానులు సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
డిస్నీ+ హాట్‌స్టార్ సేవల్లో భారతదేశ వ్యాప్తంగా అంతరాయం ఏర్పడినట్లు డౌన్‌డెటెక్టర్.ఇన్ పేర్కొంది. ఉదయం 11.30 నుంచి హాట్‌స్టార్ యాప్, వెబ్సైట్ సేవల్లో అవాంతరాలు ఎదుర్కొన్నట్లు యూజర్లు ఫిర్యాదు చేశారు. ఎర్రర్ మెసేజ్ స్క్రీన్ షాట్లను పలువురు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఢిల్లీ, జైపూర్, లక్నో, కోల్‌కతా, నాగ్‌పూర్, హైదరాబాద్, ముంబై మరియు చండీగఢ్‌లో అంతరాయం ఏర్పడినట్లు డౌన్‌డెటెక్టర్ తెలిపింది.
డిస్నీ+ హాట్‌స్టార్, మా యాప్‌లు మరియు వెబ్‌లో సేవలో ఊహించని సాంకేతిక సమస్యలు వచ్చాయని కంపెనీ స్పందించింది. సమస్య త్వరలో పరిష్కరించబడుతుందని, తమ బృందం సమస్యలపై కృషి చేస్తోందని స్ట్రీమింగ్ సర్వీస్ హామీ ఇచ్చింది. మధ్యాహ్నం 2.30 గంటల సమయానికి డిస్నీ+ హాట్‌స్టార్ సేవలు యథావిధిగా అందుబాటులోకి వచ్చాయి. దాదాపు 45 నుంచి 60 నిమిషాల పాటు సమస్య కొనసాగిందని సమాచారం తెలుస్తోంది.
భారత్- ఆస్ట్రేలియా మధ్య రెండో టెస్టు జరుగుతున్న వేళ డిస్నీ+ హాట్‌స్టార్‌లో అంతరాయం ఏర్పడినట్లు మాజీ క్రికెటర్ అభినవ్ ముకుంద్ ట్వీట్ చేశారు. ఢిల్లీ వేదికగా భారత్, ఆసీస్ మధ్య రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్ ఆలౌట్ దిశగా కొనసాగుతోంది. ప్రస్తుతం 77 ఓవర్లు ముగిసేసరికి ఆసీస్ స్కోరు 256/9కి చేరింది. ఆసీస్ బ్యాటర్లు మాథ్యూ కుహ్నెమాన్, పీటర్ హ్యాండ్స్కాంబ్ క్రీజ్‌లో ఉన్నారు.
Also Read: Vivo V27 Pro India Launch: వివో నుంచి సూపర్ క్యూట్ ఫోన్.. డిజైన్, ఫీచర్లు చూసి షాక్ అవుతున్న జనాలు!
Also Read: Budh Mahadasha 2023: 17 ఏళ్ల పాటు బుధ గ్రహ మహాదశ.. ఈ వ్యక్తులకు ఆనందం, శ్రేయస్సు! ధనవంతులు అవుతారు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.