Vasant Panchami Saraswati Puja 2025 Exact Time: హిందూ సాంప్రదాయంలో వసంత పంచమికి ప్రత్యేకమైన ప్రాముఖ్య ఉంటుంది. ఈ రోజు మహా లక్ష్మీ మరో అవతారమైన సరస్వతి దేవిని పూజించడం ఆనవాయితిగా వస్తోంది. భక్తులంతా ఈ రోజు నదీస్నానాలు చేసి సరస్వతి దేవిని పూజిస్తారు అయితే ఈ సంవత్సరం ఫిబ్రవరి 2న వసంత పంచమి వచ్చింది. వసంత పంచమి పండగ శుభ సమయం ఉదయం 9:14 నుంచి మధ్యాహ్నం 12:01 వరకు ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.
వసంత పంచమి ఈ ఏడాది మాఘ శుక్ల షష్టి తిథిన వస్తోంది. తిథి ప్రకారం, వసంత పంచమి ఫిబ్రవరి 3వ తేది వరకు ఉంటుంది. అయితే ఈ తిథి రెండు రోజుల పాటు కొనసాగుతోంది. కాబట్టి ఈ వసంత పంచమిని ఏ రోజు జరుపుకోవడం మంచిదో? ఈ రోజు ఏయే పనులు చేయడం వల్ల లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం పొందవచ్చో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
వసంత పంచమి రోజు లక్ష్మీదేవిని పూజించడం వల్ల కెరీర్లో విజయాలు సాధించడమే కాకుండా జ్ఞానానంతో పాటు తెలివిని పొందుతారు. కాబట్టి ఈ రోజు వస్తువులను దానం చేయడం వల్ల ఊహించని లాభాలు పొందుతారు. ముఖ్యంగా పేద విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు దానం చేయడం వల్ల జీవితంలో ఊహించని లాభాలు పొందుతారు.
వసంత పంచమి రోజు తప్పకుండా ఈ పనులు చేయండి:
వసంత పంచమి రోజున పేద విద్యార్థులకు లేదా బ్రాహ్మణ విద్యార్థులకు డబ్బులు దానం చేయడమే కాకుండా విద్యను అందిస్తే జీవితంలో డబ్బు, ఆనందానికి ఎలాంటి లోటు ఉండదు. అంతేకాకుండా ఆర్థిక సంక్షోభం నుంచి కూడా సులభంగా బయటపడతారని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అలాగే సంపాదన కూడా పేరుగుతుందని నమ్మకం..
వసంత పంచమి రోజున సరస్వతి దేవికి పసుపు రంగుతో కూడిన స్వీట్స్, పువ్వులు సమర్పించడం వల్ల ఊహించని జీవితంలో ఊహించని ప్రయోజనాలు కూడా కలుగుతాయి. అంతేకాకుండా జీవితంలో ఆనందంతో పాటు శ్రేయస్సు లభిస్తుంది. అలాగే జీవితంలో ఎలాంటి పనులు చేసిన ముందుకు వెళ్లే సామర్థ్యాన్ని పొందుతారని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.
సరస్వతి దేవిని పురాణాల్లో అన్నపూర్ణదేవిగా పేర్కొన్నారు. అయితే ఈ వసంత పంచమి ఈ దేవతల అనుగ్రహం పొందానుకునేవారు అన్నదాన కార్యక్రమం చేయడం చాలా మంచిదని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ఈ రోజు ధన, ధన్యాలు దానం చేయడం వల్ల కూడా బోలెడు లాభాలు పొందుతారు.
తల్లి సరస్వతిదేవి ఎంతో ఇష్టమైన రంగుల్లో పసుపు రంగు ఒకటి. ఈ వసంత పంచమి రోజు పేదలకు పసుపు రంగు వస్తువులను దానం చేయడం వల్ల ఊహించని ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా జీవితంలో ఆర్థిక సంక్షోభం కూడా తొలగిపోతుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అలాగే ఆరోగ్యపరంగా కూడా చాలా ప్రయోజనాలు పొందుతారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter