Ugadi 2022: కరోనా, రష్యా ఉక్రెయిన్​ యుద్ధం ముగుస్తుందా.. కొత్త పంచాంగం ఏం చెబుతోంది

Ugadi 2022: ఉగాది పండుగ వచ్చేస్తోంది. శనివారం తెలుగు ప్రజలంతా శుభకృత్​నామ సంవత్సరాన్ని జరుపుకోనున్నారు. మరి ఈ సంవత్సరం ఎవరికి ఎలా ఉండనుంది? తెలుసుకుందాం!

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Apr 1, 2022, 04:21 PM IST
  • రేపే తెలుగింటి తొలి పండుగ ఉగాది
  • కొత్త పంచాంగంలో ఆకస్తికర విషయాలు..
  • కరోనా, ఉక్రెయిన్ యుద్ధంపై అంచనాలు ఇలా..
Ugadi 2022: కరోనా, రష్యా ఉక్రెయిన్​ యుద్ధం ముగుస్తుందా.. కొత్త పంచాంగం ఏం చెబుతోంది

Ugadi 2022: ఏప్రిల్​ 2న ఉగాది పండుగ. ప్రపంచవ్యాప్తంగా తెలుగు ప్రజలంతా నూతన సంవత్సరానికి స్వాగతం పలికేందుకు సిద్ధమవుతున్నారు. ఉగాది వచ్చిందంటే.. తెలుగు ప్రజలంతా.. కొత్త పంచాంగంలో ఏముందో తెలుసుకునేందుకు సిద్ధమవటం సర్వ సాధారణం.

కొత్త పంచాంగం ప్రకారం ఈ సంవత్సరం (శుభకృత్​నామ సంవత్సరం) ఎలా ఉండనుంది? కరోనా సమస్యలు ఈసారైనా.. తీరుతాయా? రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ముగుస్తుందా? అనే విషయాలపై.. జోతిష్య నిపుణులు పాలెపు రాజేశ్వర శర్మ చెప్పిన విషయాలు మీకోసం..

కరోనా తొలగిపోతుందా?

రెండు సంవత్సరాలుగా కరోనా మహమ్మారి తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోందని.. అందులో ఒక ఏడాది పూర్తిగా జనజీవనం స్తంభించిందని గుర్తు చేసుకున్నారు రాజేశ్వర శర్మ. ఇంకొక అర సంవత్సరంపాటు కొవిడ్ విజృంభణ తీవ్ర రూపం దాల్చినట్లు చెప్పారు. అయితే ఈ ఏడాది మాత్రం అలాంటి సమస్యలు ఉండవని ఆశాభావం వ్యక్తం చేశారు.

యుద్ధం ముగుస్తుందా?

ఏప్రిల్ 4 తర్వాత యుద్ధం ఆగకుంటే మాత్రం.. భయాలు ఇంకా పెరగొచ్చని చెప్పారు రాజేశ్వర శర్మ. నాల్గవ తేదీన శని, కుజుడి యుతి చాలా దగ్గరగా ఉండి.. కుంభ రాశిలో ప్రవేశిస్తారని.. ఆ లోపు ఈ యుద్ధం సంప్రదింపుల ద్వారా ముగియకుంటే మాత్రం పరిస్థితి మరింత తీవ్రరూపం దాల్చుతుందని వివరించారు.

Also read: Chaitra Navaratri 2022: చైత్ర నవరాత్రుల ప్రభావం.. ఆ 6 రాశుల వారికి బాగా కలిసొస్తుంది...

Also read: Chaitra Amavasya 2022: రాబోయే చైత్ర అమావాస్యకు ఈ దోషాలను నివారించుకుంటే మేలు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News