House Building Advance Hike: తమిళనాడు సర్కారు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్ గిఫ్ట్ అందించింది. హౌసింగ్ అడ్వాన్స్ పెంపునకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పూర్తి వివరాలు ఇలా..
తమిళనాడు హౌసింగ్ బోర్డ్ (TNHB) నెరుకుండ్రం స్కీమ్‌లో భాగంగా ప్రభుత్వ ఉద్యోగులు, ఐఏఎస్, ఆల్ ఇండియా ఉద్యోగులకు హౌస్ అడ్వాన్స్ మరో రూ.5 లక్షలు అందించేందుకు స్టాలిన్ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
ఉద్యోగులు బ్యాంక్ నుంచి రుణాలు తీసుకునే బదులు.. ప్రభుత్వం నుంచే ఈ అడ్వాన్స్ అందుకునే సౌకర్యం కల్పిస్తోంది.
అడ్వాన్స్ తీసుకున్న తరువాత నెలవారీ జీతంలో కొంతమొత్తం కట్ చేసుకుంటుంది. వాయిదాల పద్ధతిలో ఉద్యోగుల నుంచి ఈ అడ్వాన్స్ డబ్బులు వసూలు చేస్తుంది.
ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్లకు రూ.20 లక్షల నుంచి రూ.25 లక్షలకు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షలకు పెంచింది.
నెరుకుండ్రం స్కీమ్ గృహాల విక్రయంపై 5 శాతం జీఎస్టీని చెల్లించాలని TNHB నిర్ణయించినందున అడ్వాన్స్ అమౌంట్‌ను పెంచింది.
తమిళనాడు పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ విషు మహాజన్ ప్రభుత్వానికి రాసిన లేఖ మేరకు.. అడ్వాన్స్‌ను పెంచుతూ నిర్ణయం తీసుకుంది.