Horoscope Today March 12 2022: ఈరోజు రాశి ఫలాలు.. ఆ రాశుల వారికి ఊహించని శుభవార్త అందుతుంది!

March 12 2022, Daily Horoscope. ఈ రోజు మిథునం, మీనం మరియు ధనస్సు రాశుల వారికి శుభకాలం నడుస్తోంది. ఈ రాశుల వారికి ఊహించని శుభవార్త అందుతుంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 12, 2022, 06:41 AM IST
  • Match 12 2022 రాశి ఫలాలు
  • ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే?
  • ఆ రాశుల వారికి ఊహించని శుభవార్త
Horoscope Today March 12 2022: ఈరోజు రాశి ఫలాలు.. ఆ రాశుల వారికి ఊహించని శుభవార్త అందుతుంది!

Today Horoscope March 12 2022: మేషం ( Aries): మీ మీ రంగాల్లో అంచనాలను అందుకుంటారు. కుటుంబంతో కలిసి విందు, వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఒక శుభవార్త ఆనందాన్ని ఇస్తుంది. దైవారాధన మానవద్దు.

వృషభం (Taurus): ఉత్సాహంతో పనిచేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. బంధు, మిత్రుల సహకారం లేకపోయినా ప్రారంభించిన పనులను పూర్తి చేస్తారు. ఆరోగ్యం జాగ్రత్త. ప్రయాణాలు తప్పకపోవచ్చు. వృథా ఖర్చులు ఉన్నాయి. గోసేవ చేయాలి.

మిథునం (Gemini): నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. కుటుంబంతో కలిసి శుభకార్యక్రమాలలో పాల్గొంటారు. బంధు, మిత్రుల వల్ల మేలు జరుగుతుంది. ఒక ఊహించని శుభవార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. కనకధారాస్తోత్రం చదవడం మంచిది. 

కర్కాటకం (Cancer): శ్రమ అధికం అవుతుంది. ఉత్సాహం తగ్గకుండా చూసుకోవాలి. బంధువులతో ఆచితూచి వ్యవహరించాలి. పంచముఖ ఆంజనేయుడిని ఆరాధించండి.

సింహం (Leo): మంచి కాలం నడుస్తోంది. ప్రయత్నాలు ఫలిస్తాయి. అవసరానికి తగిన సహాయం అందుతుంది. ధన, ధాన్య అభివృద్ధి ఉంది. శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు. ఒక వార్త కుటుంబ సభ్యుల్లో ఆనందాన్ని కలిగిస్తుంది. శివనామస్మరణ మంచిది.

కన్య (Virgo): మీ పనితో పై అధికారుల మనసులను గెలుస్తారు. గౌరవ సన్మానాలు అందుకుంటారు. బంధువులతో విబేధాలు వచ్చే సూచనలు ఉన్నాయి. విష్ణు నామస్మరణ మంచిది.

తుల (Libra): మీ శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. అధికారులు మీకు అనుకూలమైన ఒక నిర్ణయాన్ని తీసుకుంటారు. కీలక పనులను పూర్తి చేస్తారు. కుటుంబంతో కలిసి కీలక నిర్ణయాలు ఫలిస్తాయి. శివస్తోత్రం చదివితే మంచిది.

వృశ్చికం (Scorpio): అప్రమత్తంగా ఉండాల్సిన సమయం ఇది. కుటుంబ వాతావరణం అనుకూలంగా లేదు. ప్రారంభించిన పనులలో ఆటంకాలు ఉన్నాయి. శారీరక శ్రమ పెరుగుతుంది. దైవారాధన మానవద్దు.

ధనస్సు (Sagittarius): మీ మీ రంగాల్లో అనుకూల ఫలితాలు ఉన్నాయి. ఇష్టమైన వారితో మరపురాని క్షణాలను గడుపుతారు. ప్రేమ వ్యవహారంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. మానసిక ఆనందం ఉంది. ఆంజనేయ ఆరాధన మంచిది.

మకరం (Capricorn): ప్రారంభించిన పనులను విజయవంతంగా పూర్తిచేస్తారు. కీలక బాధ్యతలు మీద పడుతాయి. విందు, వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రయాణాలు చేస్తారు. శివారాధన శుభప్రదం.

కుంభం  (Aquarius): మధ్యమ ఫలితాలు ఉన్నాయి. అన్ని పనులలో ముందు జాగ్రత్తతో వ్యవహరించాలి. మీ మీ రంగాల్లో అనుకూల ఫలితాలు అందుతాయి. చిన్నచిన్న అంశాలను పెద్దవి చేసుకోవడం సరికాదు. ప్రయాణ సూచన ఉంది. దుర్గారాధన శుభప్రదం.

మీనం (Pisces): శుభ ఫలితాలు కలుగుతాయి. సమస్యగా అనిపించిన అంశాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. బంధువులతో ఆనందాన్ని పంచుకుంటారు. ప్రయాణాలు చేస్తారు. శివుణ్ణి ఆరాధిస్తే మంచిది.

Also Read: Tollywood Drugs Case: టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసులో ప్రముఖుల బాగోతాలు బయటపడతాయంటున్న రేవంత్ రెడ్డి

Also Read: పాక్ భూభాగంలోకి ఇండియన్ మిస్సైల్.. విచారం వ్యక్తం చేసిన భారత రక్షణ శాఖ..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News