Surya Gochar 2023: జూలై 17న కర్కాటక రాశిలోకి సూర్యుడు.. ఈ 3 రాశులకు మంచి రోజులు మెుదలు..

Sun transit 2023:  ఆస్ట్రాలజీలో సూర్యభగవానుడిని గ్రహాల రాజు అని పిలుస్తారు. ఈ నెల 15న సూర్యుడు తన రాశిని మార్చి కర్కాటక రాశిలోకి ప్రవేశించనున్నాడు. ఆదిత్యుడి సంచారం ఏయే రాశులవారికి మేలు చేస్తుందో తెలుసుకుందాం.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jul 9, 2023, 08:32 AM IST
Surya Gochar 2023: జూలై 17న కర్కాటక రాశిలోకి సూర్యుడు.. ఈ 3 రాశులకు మంచి రోజులు మెుదలు..

Surya Gochar 2023 effect: గ్రహాలు కాలానుగుణంగా రాశులను మారుస్తాయి. జూలై 17వ తేదీ ఉదయం 05.19 గంటలకు గ్రహాల అధిపతి అయిన సూర్యుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించనున్నాడు. ప్రస్తుతం సూర్యుడు మిథునరాశిలో కూర్చున్నాడు. సూర్యుని రాశి మార్పు ప్రభావం కొన్ని రాశులపై సానుకూలంగా, మరికొన్ని రాశులపై ప్రతికూలంగా ఉండనుంది. సూర్యుడి సంచార సమయంలో మూడు రాశులవారు ప్రత్యేక ప్రయోజనాలు పొందనున్నారు. ఆ లక్కీ రాశులు ఏవో తెలుసుకుందాం. 

మేషరాశి
సూర్యుడి సంచారం మేషరాశి వారికి అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో మీరు శుభవార్త వినే అవకాశం ఉంది. మీరు కెరీర్ లో మంచి పురోగతి సాధిస్తారు. ప్రభుత్వ రంగానికి సంబంధించిన వ్యక్తులు పురోభివృద్ధి సాధిస్తారు. ఈ సమయం విద్యార్థులకు కలిసి వస్తుంది. మీరు ఏ రంగంలో అడుగుపెడితే అందులో విజయం సాధిస్తారు. మెుత్తానికి ఈ సమయం మీకు అనుకూలంగా ఉంటుంది. 

కర్కాటక రాశి
కర్కాటక రాశి వారికి సూర్య సంచారం శుభప్రదంగా ఉంటుంది. మీరు అనారోగ్యం నుండి బయటపడతారు. వ్యాపారులు మంచి లాభాలను పొందుతారు. మీ వైవాహిక జీవితంలో వచ్చే సమస్యలన్నీ తొలగిపోతాయి. ఉద్యోగం మారడానికి ఇదే అనుకూల సమయం. మీరు ఆర్థికంగా పురోగతి సాధిస్తారు. మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది.

Also Read: Mercury transit 2023: ఇవాళ కర్కాటక రాశిలోకి బుధుడు.. ఈ 3 రాశులకు లాటరీ తగలడం పక్కా..

తులారాశి
సూర్యుడి రాశి మార్పు తులరాశి వారికి కలిసి రానుంది. మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీ కుటుంబంలో ఆనందం వెల్లివిరిస్తుంది. మీరు ఆర్థికంగా పురోగతి సాధిస్తారు. మీకు ఆకస్మిక ధనలాభం ఉంటుంది. మీరు కెరీర్ లో మంచి పురోగతి సాధిస్తారు. మీరు ఊహించని ధనలాభం పొందుతారు. మీ శ్రమకు తగిన ప్రతిఫలం దక్కుతుంది. మీ ఆదాయం రెట్టింపు అవుతుంది. 

Also Read: Astrology: 20 ఏళ్ల తర్వాత సూర్యుని రాశిలో కుజుడు-శుక్రుడు సంయోగం.. ఈ రాశులవారు కోటీశ్వరులవ్వడం ఖాయం..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News