Maha shivratri shivpuja for blessing of lord shiva: మహా శివరాత్రి వేళ దేశంలోని శివాలయాలన్ని ఇప్పటి నుంచే భక్తులతో కళ కళ లాడుతున్నాయి. ఈ సారి మహా శివరాత్రిని ఫిబ్రవరి 26 న జరుపుకోబోతున్నాం. అంతే కాకుండా.. ముఖ్యంగా శివరాత్రి వేళ అన్ని వయసుల వారు ఉపవాసాలు చేసేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. ఈ క్రమంలో శివరాత్రి వేళ ఉపవాసాలు చేసేటప్పుడు తప్పకుండా కొన్ని జాగ్రత్తలు పాటించాలని నిపుణులు చెబుతున్నారు.
శివరాత్రికి పెద్ద వయసుల వారు, ప్రెగ్నెంట్ లేడీస్, చిన్న పిల్లలు ఫాస్టింగ్, రాత్రి జాగరణ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఒకవైపు ఇప్పటి నుంచే ఎండలు విపరీతంగా దంచికొడుతున్నాయి. ఈ క్రమంలో వీళ్లు మాత్రం ఉపవాసాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. కొంత మంది భక్తి శివుడి మీద చిత్తం మరోవైపు ఉన్న విధంగా ప్రవర్తిస్తారు.
ముఖ్యంగా శారీరక సమస్యలు, డయాబెటిక్ లు, హర్ట్ పెషెంట్ లు,దీర్ఘకాలిక సమస్యలతో ఉన్న వారు.. శివరాత్రి వేళ ఉపవాసం ఉండేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు. పూర్తిగా ఉపవాసం ఉండకుండా.. ఏదైన ఫలాలు, పాలు తీసుకొని ఉపవాసం చేసుకొవ్చని పండితులు చెబుతున్నారు. కొంత మంది మాత్రం.. కేవలం నీళ్లను మాత్రమే తీసుకుని ఉపవాసం చేస్తుంటారు. కానీ దీని వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.
అందుకే తమ ఉపవాసం ఉండేటప్పుడు తమ ఆరోగ్యంకూడా జాగ్రత్తగా చూసుకొవాలని నిపుణులు చెబుతున్నారు. మరికొందరు తమ ఆరోగ్యం ఉపవాసంకు సహాకరించదని చెప్తుంటారు. అలాంటి వారు శివరాత్రి రోజంతా శివనామస్మరణ చేస్తు, ఉపవాసం చేయకున్న కూడా.. శివుడ్ని ధ్యానిస్తు ఉండాలని పండితులు చెబుతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి