Chandra Grahan 2022: చంద్రగ్రహణం రోజు ఏం చేయాలో, ఏం చేయకూడదో తెలుసా?

Lunar Eclipse 2022: చంద్రగ్రహణం ఏర్పడటానికి రెండు రోజులు మాత్రమే మిగిలింది. అయితే గ్రహణ సమయంలో ఏమి చేయాలో, ఏమి చేయకూడదో తెలుసుకుందాం రండి.  

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Nov 6, 2022, 11:41 AM IST
Chandra Grahan 2022: చంద్రగ్రహణం రోజు ఏం చేయాలో, ఏం చేయకూడదో తెలుసా?

Chandra Grahan 2022: మరో రెండు రోజుల్లో చంద్రగ్రహణం ఏర్పడబోతుంది. ఇది ఈ ఏడాది వచ్చే చివరి చంద్రగ్రహణం. ఇప్పుడు రాబోయేది సంపూర్ణ చంద్రగ్రహణం. ఈసారి ఈ గ్రహణం నవంబరు 8న అంటే దేవ్ దీపావళి, కార్తీక పౌర్ణమి వంటి మంచి రోజున వస్తుంది. మనం గ్రహణాన్ని అశుభంగా భావిస్తాం. ఎందుకంటే ఇది మన జీవితంలో అనేక మార్పులను తెస్తుంది. ఇంతకీ చంద్రగ్రహణం (Lunar Eclipse 2022) సమయంలో ఏమి చేయాలో, ఏమి చేయకూడదో తెలుసుకుందాం.

చేయాల్సిన పనులివే..
>> దానం, జపం చేసే వాళ్లు గ్రహణం ప్రారంభ సమయంలో పట్టుస్నానం చేయాలి. గ్రహణం ముగిశాక విడుపు   స్నానం చేయాలి. 
>> చంద్రగ్రహణం సమయంలో దానం చేయడం శుభప్రదంగా భావిస్తారు.
>> గ్రహణం ముగిసిన తర్వాత ఇంటిని గంగాజలంతో శుద్ధి చేయాలి. 
>> గ్రహణ కాలంలో ఆహార పదార్థాలపై తులసి లేదా గరిక ఆకులను వేయండి. 
>> గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు ఇంటి నుండి బయటకు రాకూడదు.

చేయకూడని పనులు ఇవే..
>> గ్రహణం సమయంలో భోజనం చేయకూడదు.  గ్రహణం ప్రారంభానికి ముందే ఆహారం తినాలి. 
>> గ్రహణ  కాలంలో కొత్త పనులు, శుభ కార్యాలు చేయకూడదు. 
>> గ్రహణ సమయంలో గోళ్లు కత్తిరించడం, జుట్టు దువ్వడం, పళ్లను శుభ్రం చేయడం వంటి పనులు చేయకండి.
>> గ్రహణ కాలంలో నిద్రపోకూడదు. 
>>  గ్రహణ సమయంలో కత్తులు లేదా పదునైన వస్తువులు వాడకూడదు. 

(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ అంచనాలు, సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దానిని నిర్ధారించలేదు.)

Also Read: Chandra Grahan 2022: దేవ్ దీపావళి నాడు చంద్రగ్రహణం... 12 రాశులపై గ్రహణ ప్రభావం.. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News