Today Horoscope In Telugu: నేటి రాశి ఫలాలు మార్చి 10, 2021 Rasi Phalalu, ఆ రాశులవారికి ఆకస్మిక ధనలాభం

Today Rasi Phalalu in Telugu 10 March 2021: ఆకస్మిక ధనలాభం, వాహనయోగం, కుటుంబంలో ఎలా ఉండనుందననే విషయాలు ఈరోజు మీ సంబంధిత రాశిచక్ర చిహ్నంలోని నక్షత్రాలు మరియు గ్రహాలు మీ రోజును ఎలా ప్రభావితం చేస్తాయో తెలుసుకోండి.

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 10, 2021, 07:54 AM IST
Today Horoscope In Telugu: నేటి రాశి ఫలాలు మార్చి 10, 2021 Rasi Phalalu, ఆ రాశులవారికి ఆకస్మిక ధనలాభం

Horoscope Today 10 March 2021: పన్నెండు రాశిచక్రాలు ప్రతి దాని ప్రత్యేక లక్షణాన్ని కలిగి ఉంటాయి. ఆకస్మిక ధనలాభం, వాహనయోగం, కుటుంబంలో ఎలా ఉండనుందననే విషయాలు ఈరోజు మీ సంబంధిత రాశిచక్ర చిహ్నంలోని నక్షత్రాలు మరియు గ్రహాలు మీ రోజును ఎలా ప్రభావితం చేస్తాయో తెలుసుకోండి. మేషం, వృషభం, మిథునం మొదలుకుని మీన రాశివారికి మార్చి 10న సందీప్ కొచ్చర్ నేటి రాశి ఫలాలు అందిస్తున్నారు.

మేష రాశి
ఈరోజు మీ మాటలే మీకు కవచంలా మారతాయి. మీ కోసం ఎవరైనా ఏదైనా చేయాలని భావిస్తే మీరు ఈ రోజు వారిని సంప్రదించాల్సి ఉంటుంది. మీకు కావలసింది పొందడానికి మీరు వారిని సులభంగా ఒప్పించగలుగుతారు. నేడు మీకు ఆకస్మిక ధనలాభం గోచరిస్తుంది. ఈరోజు చాలా సంతోషంగా గడుపుతారు. ఓవైపు పేరు, ప్రఖ్యాతులు వస్తున్నా మరోవైపు ఆటంకాల బారిన పడే అవకాశం కనిపిస్తోంది.

Also Read: Astrology: కుంభరాశిలోకి శుక్రుడు ప్రవేశం, 12 రాశుల వారిపై దీని ప్రభావం ఇలా ఉండనుంది 

వృషభ రాశి
ఇతరులపై ఆధార పడకుండా మీకు మీరే ప్రేరణ పొందాలి. గత కొన్ని రోజులుగా మీకు అనుకూలమైన విషయాలు జరుగుతున్నాయి. మీరు తాకిన ప్రతిదాన్ని పొందడానికి అలవాటు పడ్డారు. నేడు మీరు కోరుకున్న దానికోసం కొంచెం కష్టపడాల్సి ఉంటుంది. కుటుంబంలో కలహాలు తలెత్తవచ్చు. రుణాల కోసం యత్నాలు మొదలుపెడతారు. మీ సన్నిహితులతో 
చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తే ప్రమాదాలు తప్పుతాయి.

మిథున రాశి
సరైన నిర్ణయాలు తీసుకోవడం ఈ రోజు మీకు లాభాలను తీసుకొస్తుంది. మీరు ఆలోచిస్తున్న విషయాన్ని చాలా సూటిగా స్పష్టంగా చెబుతారు. గందరగోళ పరిస్థితుల కారణంగా మీ పనులు నిలిచిపోతాయి. కొన్ని విషయాలలో మీ ప్రమేయం లేకున్నా ఇబ్బందుల బారిన పడతారు. కష్టాల్లో ఉన్న వారికి మీ వంతు సాయం చేసేందుకు యత్నిస్తారు.

కర్కాటక రాశి
ఈ రోజు మీకు మరింత స్వతంత్రంగా అనిపిస్తుంది. మీ జీవితాన్ని మీ చేతుల్లోకి తీసుకున్నట్లు మీకు అనిపిస్తుంది. మీరు శక్తి వంచన లేకుండా ప్రయత్నిస్తూనే ఉంటే విజయం తథ్యం. అయితే మీకు కావాలసినదేమిటో త్వరగా తెలుసుకోండి. కుటుంబసభ్యులు, సన్నిహితులతో సరదాగా గడుపుతారు. ప్రయణాలు చేస్తారు. సంఘంలో గౌరవం, మర్యాదలు పొందుతారు. శుభకార్యాల కోసం యోచన మొదలవుతుంది.

సింహ రాశి
మీరు కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. చిరునవ్వుతో ఉంటూ అందర్ని పలకరించాలి. చాలా విషయాలలో నెలకొన్న ఆందోళన దూరం కానుంది. కొన్ని విషయాలు మీకు అనుకూలమైన ఫలితాలు ఇవ్వవు. ఈరోజు ఎక్కువగా ఒత్తిడి చేయకుండా ప్రయత్నించండి. ప్రయాణాల కారణంగా ధన వ్యయం తప్పదు. ఆర్థిక సమస్యలకు సైతం దారి తీయవచ్చు.

Also Read: Srisailam Brahmotsavalu: మహా శివరాత్రికి ముస్తాబవుతున్న శ్రీశైలం క్షేత్రం

కన్య రాశి
ఈ రోజు మీరు సమాచారాన్ని వెనక్కి తీసుకోవద్దు. మీ చుట్టూ ఉన్న ఇతరులు తెలుసుకోవాలని మీరు భావిస్తే, దాన్ని వారికి తెలపండి. దానివల్ల మీ చుట్టుపక్కల ప్రజలకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఉద్యోగులు, వ్యాపారులకు కలిసొస్తుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేయనున్నారు. నేడు మీకు ఆకస్మిక ధనలాభం గోచరిస్తుంది.

తులా రాశి
అనుకోకుండా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. సుదీర్ఘకాలం నుంచి చూడని వ్యక్తులను కలుసుకుంటారు. ప్రతి విషయాన్ని గురించి ఆలోచించడం మానేసి, పని ప్రారంభించాల్సిన సమయం ఆసన్నమైంది. స్థలం మార్పుతో మీ ఒత్తిడి తగ్గుతుంది.  చిన్ననాటి స్నేహితుడిని కలుసుకుంటారు. మీరు మీ లక్ష్యాలపై ఎక్కువ దృష్టి పెడతారు. ఖర్చులు పెరగడంతో రుణాల కోసం యత్నిస్తారు. ఉద్యోగులు, వ్యాపారులకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి.

వృశ్చిక రాశి
వయసులో, హోదాలో మీకన్నా చిన్నవారి నుంచి సలహా తీసుకోవాలని భావిస్తారు. వారికి చాలా తెలుసునని, దాని వల్ల మీకు ప్రయోజనం చేకూరుతుందని భావిస్తారు. చేపట్టాల్సిన కొత్త ప్రాజెక్టులు, పనులలో ఇతరుల సహాయం అడగడానికి బయపడకండి. ఉద్యోగులు డబ్బు విషయంలో జాగ్రత్త వహించాలి. అనారోగ్యం బారిన పడతారు. కుటుంబసభ్యులతో చాలా జాగ్రత్తగా మాట్లాడితే కొన్ని విభేదాలు రాకుండా చూసుకోవచ్చు.

ధనుస్సు రాశి
ఈ రోజు మీరు ప్రమాదమని తెలిసిన వాటి జోలికి వెళ్లవద్దు. మీ కెరీర్‌ను ఏ ఆంటకం లేకుండా కొనసాగిస్తారు. వ్యాపారులకు లాభసాటిగా ఉంటుంది. మీకు తెలిసిన వాటికి కట్టుబడి ఉండండి, మీకు అనుకూల ఫలితాలు వస్తాయి. ఊహించని వ్యక్తి నుండి చాలా మద్దతు పొందుతారు. ఆకస్మిక ధనలాభం గోచరిస్తుంది. వస్తువులు, బంగారం కొనుగోలు చేస్తారు. మీకు ఈరోజు అంతా శుభాలే కలుగుతాయి.

మకర రాశి
మీ మాటతీరు ఈరోజు ఫలితాలు ఇస్తుంది. ప్రజలు సాధారణంగా మిమ్మల్ని అర్థం చేసుకోవడానికి చాలా కష్టపడతారు. అనుకున్న విషయాలను స్పష్టంగా చెబుతారు. దీని వల్ల అతా శుభం జరగనుంది. ఇది మంచి సంకేతం. పనిచేసే చోట ఉన్నతాధికారుల గౌరవం పొందుతారు. మీ పనికి ప్రశంసలు దక్కుతాయి. చిన్నారుల కారణంగా కొన్ని సమస్యలు ఎదురవుతాయి.

కుంభ రాశి
ఈ రోజు మీ శత్రువుల పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలి. జీవితంలో మీ స్థానాన్ని పొందటానికి ప్రయత్నిస్తున్న వ్యక్తులు కొందరు ఉన్నారు. అయితే దీనిపై మీరు చింతించకండి. మీ చుట్టూ ఉన్న మంచి వ్యక్తులు అలా జరగకుండా అడ్డుకుంటారు. మిమ్మల్ని అందరూ ప్రేమిస్తారు. అయితే అధిక ఒత్తిడికి లోను కాకుండా చేసుకోవాలి. మానసిక ఆందోళన, అనారోగ్య సమస్యలు గోచరిస్తున్నాయి. ఉద్యోగులకు పని ఒత్తిడి పెరుగుతుంది.

Also Read: Health Benefits of Milk: రాత్రి నిద్రించే ముందు గ్లాసు పాలు తాగితే ఎన్నో ప్రయోజనాలు

మీన రాశి
మీకు తెలియని సమాచారాన్ని కనుగొనడానికి కొత్త మార్గాలను ఎంచుకుంటారు. కుటుంబంతో సరదాగా గడుపుతారు. కొన్ని విషయాలలో ఇతరులపై ఆధారపడతారు. అయితే చేపట్టిన పనులలో విజయం అందుకుంటారు. నేడు మీనరాశి వారికి ధనలాభం. నేడు సమాజంలో గౌరవం, ప్రతిష్టలు పెరుగుతాయి. భారీ ప్రాజెక్టులు చేపట్టాలని నిర్ణయం తీసుకోనున్నారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News