Akshaya Tritiya: అక్షయ తృతీయ. ఇటీవలికాలంలో ఎక్కువగా విన్పిస్తున్న పదం. ఇవాళ చేసే పనులు సమస్యల్ని పోగోడుతాయనేది ఓ నమ్మకం. అన్నింటికంటే ముఖ్యంగా బంగారానికి..అక్షయ తృతీయకు మంచి సంబంధమే ఉంది.
ఆర్ధిక పరమైన లేదా ఇంటి సమస్యలుంటే.. అక్షయ తృతీయ నాడు చేసే కొన్ని పనుల వల్ల ఆ సమస్యలు దూరమౌతాయని అంటారు. అక్షయ తృతీయ నాడు కొన్ని మత సంబంధిత కార్యక్రమాల ద్వారా ఇబ్బందుల్ని తొలగించుకోవచ్చట. అక్షయ తృతీయ వంటి మంచి ముహూర్తపు ప్రయోజనాలు పూర్తిగా పొందాలంటే దేవి ఉపాసన చేయాలి. తద్వారా మానసిక, శారీరక ఆరోగ్యం బాగుండటమే కాకుండా రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుందట. అందుకే చాలామంది ఈరోజున దానాలు , వ్రతాలు చేస్తుంటారు. ఈరోజున చేసే దానాలు, తపస్సు,యాగాలు, తర్పణాలు ఎప్పటికీ వృధా కావనేది హిందూవుల నమ్మకం.
అక్షయ తృతీయ అనేది కొత్త పనులు చేసేందుకు అనువైన సమయంగా భావిస్తారు. అంటే బంగారం కొనడం గానీ, కొత్త వ్యాపారాలు కానీ ఇలా. ముఖ్యంగా ఆన్ లైన్ పెట్టుబడులు పెడితే మంచి ప్రయోజకరమంటారు. అక్షయ తృతీయ వంటి మంచి ముహూర్తంలో పెట్టే పెట్టుబడులు అంతరించిపోవు. అంటే లాభాలు ఆర్జిస్తారని అర్ధం. ఇవాళ్టి రోజును తలపెట్టే ఏ పనైనా మంచి ఫలితాలనిస్తుంది.
అక్షయ తృతీయ నాడు ఏం చేయాలి
ముఖ్యంగా ఈరోజును సూర్య నమస్కారంతో ప్రారంభించాలి. సూర్యదేవునికి వందనమనేది మీకు ఘన విజయాన్ని అందిస్తుంది. ఆరోగ్యాన్ని ప్రసాదించే సూర్యదేవుని వల్ల మీకు ఎప్పటికీ అనారోగ్యం దరిచేరదు. దాంతోపాటు గాయత్రి మంత్రాన్ని జపిస్తే..అద్భుత లాభాలుంటాయి. అక్షయ తృతీయ నాడు గాయత్రి మంత్రం జపిస్తే మంచిదంటున్నారు. అంతేకాకుండా అక్షయ తృతీయ నాడు లక్ష్మీదేవిని పూజిస్తే ఆ ఇంట అష్ట ఐశ్వర్యాలు ప్రాప్తిస్తాయి. లక్ష్మీదేవి కృప ఆ ఇంటిపై ఉంటుందని నమ్ముతారు. అక్షయ తృతీయ నాడు తప్పనిసరిగా దానధర్మాలు చేయాలని పండితులు చెబుతున్నారు. దాహంతో ఉన్నవారి దప్పిక తీర్చితే..చాలా పుణ్యం కలుగుతుందంటారు.
అక్షయ తృతీయ ప్రాధాన్యత
పౌరాణిక కధల ప్రకారం వేదవ్యాసుడు అక్షయ తృతీయ నాడు మహాభారతాన్ని గణేషునికి విన్పించడం ప్రారంభించారు. గంగామాత ఈరోజే నేలపై దిగింది. ఈరోజే కుబేరుడికి అంతులేని ధనం లభించింది. మహాభారతంలో ఈరోజే యుధిష్టరునికి సూర్యదేవుడు అక్షయ పాత్ర అందించాడు. ఈరోజే..సుదాముడు రాజైన తరువాత తొలిసారిగా శ్రీకృష్ణుడిని కలిసేందుకు వెళ్లాడు.
అక్షయ తృతీయ ఎప్పుడు
హిందూవులకు అక్షయ తృతీయ అత్యంత పవిత్రమైన రోజు. ఈ ఏడాది అక్షయ తృతీయ ఇంకా పన్నెండురోజుల్లో రానుంది. మే 3న అక్షయ తృతీయ ఉంది పెళ్లిళ్లు, గృహప్రవేశాలు ఇతర శుభకార్యాలు, కొత్త వ్యాపారాలు వంటివి ప్రారంభించేందుకు అక్షయ తృతీయకు మించిన ముహూర్తం లేదంటారు పండితులు. వైశాఖమాసంలోని శుక్ల పక్షంలో మూడవ తిధినాడు వచ్చేదే ఈ అక్షయ తృతీయ. ఆ రోజు మంగళవారం. ఉదయం 5 గంటల 19 నిమిషాల నుంచి ప్రారంభమై..4వ తేదీ ఉదయం 7 గంటల 33 నిమిషాల వరకూ ఉంటుంది. ఆ రోజు రోహిణీ నక్షత్రముంటుంది.
Also read: Horoscope Today April 21 2022: రాశి ఫలాలు.. ఆ రాశి వారు ప్రత్యర్థులపై పైచేయి సాధిస్తారు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
Akshaya Tritiya: అక్షయ తృతీయ ఎప్పుడు, ఏ సమయంలో.. లాభాలేంటి, ఏం చేయాలి
అక్షయ తృతీయ నాడు ఏం చేయాలి, ఏం చేస్తే ప్రయోజనాలు లభిస్తాయి
2022 మే 3వ తేదీన అక్షయ తృతీయ, ఉదయం 5 గంటల 19 నిమిషాలకు ప్రారంభం
అక్షయ తృతీయనాడు ప్రారంభించే పనుల్లో విఘ్నం ఉండదని నమ్మకం