Viral Video: రేయ్ అది పడవ కాదు రా థర్మాకోల్‌.. ఏమాత్రం జాగ్రత్త పడకపోయినా.. నువ్వు మిస్ అవ్వడం ఖాయం..

Today Funny Viral Video: భారీ కారణంగా గుజరాత్లో కొన్నిచోట్ల వాహనాలు రాకపోకలు ఆగిపోయాయి. ఓ వ్యక్తి థర్మాకోల్‌ను వాహనంగా చేసుకొని నీటి ప్రవాహం గుండా సురక్షిత ప్రదేశానికి వెళ్ళాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ గా మారింది. ఈ వీడియోకు సంబంధించిన పూర్తి వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Jul 2, 2023, 01:22 PM IST
Viral Video: రేయ్ అది పడవ కాదు రా  థర్మాకోల్‌.. ఏమాత్రం జాగ్రత్త పడకపోయినా.. నువ్వు మిస్ అవ్వడం ఖాయం..

 

Today Funny Viral Video: భారతదేశవ్యాప్తంగా కొన్ని రాష్ట్రాల ప్రజలు ఎండల కారణంగా వేడితో సతమతమవుతుంటే.. మరికొన్ని రాష్ట్రాల ప్రజలు భారీ వర్షాలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గుజరాత్ వంటి రాష్ట్రాల్లో భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. మరికొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ రాకపోకలు ఆగిపోయాయి అంటే వర్షం మాత్రం కురిసిందో మీరే అర్థం చేసుకోవాలి..! లోతట్టు ప్రాంతాల్లో ఇరుక్కున్న చాలామంది ప్రజలు ఆహారం కోసం పడిగాపులు కాస్తున్నారు. మరికొంతమంది ఇళ్లలోంచి పడవల ద్వారా బయటికి వచ్చి ఆహారాలను తీసుకువెళ్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వ్యక్తి థర్మాకోల్‌పై వెళ్తున్న సన్నివేశాలు వైరల్ గా మారాయి. కొంతమందికి నవ్వు పుట్టించే విధంగా ఉంటే.. మరి కొంతమందికి ఆశ్చర్యం కలిగిస్తోంది.

 

 



Also read: KIA SUV Cars: ఆ రెండు ఫేస్‌లిఫ్ట్ ఎస్‌యూవీలు వస్తే..క్రెటా బ్రెజాలు సర్దుకోవల్సిందేనా

గుజరాత్లో కురుస్తున్న వర్షాల కారణంగా చాలా ప్రాంతాలవాసులు ఇళ్లలో నుంచి బయటికి రావడం మానేశారు. ఇక కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవడంతో రవాణా స్తంభించిపోయింది. మరికొన్ని ప్రాంతాల్లో వర్షపు నీరు వేగంగా ప్రవహించడం కారణంగా ప్రజలు తీవ్రం అవస్థల పాలవుతున్నారు. అయితే ఇటీవలే ఓ వ్యక్తి థర్మాకోల్ పై పడుకొని నీటి ప్రవాహం గుండా వెళ్తున్న వీడియో నెట్టింట తెగ వైరల్ గా మారింది. ఆ వెళ్తున్న క్రమంలో ఆ వ్యక్తి వీడియోలు తీస్తున్న వారికి చేతులు ఆడించి, కేకలు వేయడం అందరికీ నవ్వు పుట్టించింది. తరచుగా సోషల్ మీడియాలో ఎన్నో రకాల వీడియోలు వైరల్ గా మారుతాయి కానీ ఇలాంటి నవ్వు పుట్టించే వీడియోలు ఇంతవరకు వైరల్ అవ్వడం ఇదే మొదటి సారి అని నెటిజన్లు అంటున్నారు.

గుజరాత్ లో భారీ వర్షాల కారణంగా నదులన్నీ ఉప్పొంగుతున్నాయి. దీంతో పల్లె ప్రాంతంలోని చెరువుల కట్టలు తెగిపోయి ఆ నీరంతా ఊళ్ళోకి ప్రవహిస్తోంది. దీనికి కారణంగా వాహనాల రాకపోలకు అంతరాయం కలిగింది. అంతేకాకుండా ఇప్పటికీ రైతులు తీవ్రంగా పంట నష్టపోయారని కూడా ప్రభుత్వం సర్వేలో వెల్లడించింది. అయితే వర్షాలు పడే క్రమంలో అందరూ జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ ఫన్నీ సన్నివేశాలే ఒకానొక టైంలో తీవ్ర సంఘటనలకు దారి తీయొచ్చు. కాబట్టి నీరు అతిగా ప్రవహించినప్పుడు ఇంట్లో నుంచి బయటకు రాకపోవడం చాలా మంచిది.

Also read: KIA SUV Cars: ఆ రెండు ఫేస్‌లిఫ్ట్ ఎస్‌యూవీలు వస్తే..క్రెటా బ్రెజాలు సర్దుకోవల్సిందేనా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

 Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

 

Trending News