Kanpur minor speeding car road accident video viral: ఇటీవల కాలంలో రోడ్డు ప్రమాదాలు తీవ్ర భయాందోళనలకు గురిచేస్తున్నారు. రోడ్డుపై ఎంత జాగ్రత్తగా వెళ్లున్న.. ఎవరు ఎక్కడినుంచి వచ్చి యాక్సిడెంట్ చేస్తారో.. ఎవరు రాంగ్ రూట్ లో వస్తారో.. అని చాలా మంది తెగ కంగారు పడుతున్నారు. ముఖ్యంగా చాలా మంది చిన్నారులు కారు నడపడం రాకున్న విన్పించుకోవడంలేదు. ఇంట్లో వాళ్లకు తెలియకుండా కారును నడిపిస్తున్నారు.
కారుతో స్కూటీని ఢీకొట్టిన మైనర్లు.. తల్లి మృతి
యూపీ - కాన్పూర్‌లో స్కూటీపై కుమార్తె(12)తో వస్తున్న భావనా (30)ను వేగంగా కారు ఢీకొట్టడంతో ఆమె మృతిచెందగా.. కుమార్తెకు తీవ్రగాయాలయ్యాయి.
నిందితుడు 12వ తరగతి విద్యార్థి కాగా.. మరో అబ్బాయి, ఇద్దరు మైనర్ అమ్మాయిలు కూడా కారులో ఉన్నారు pic.twitter.com/WbamLDnTGF
— Telugu Scribe (@TeluguScribe) August 3, 2024
ఇటీవల పూణేపొర్షే కారు ఘటన దేశంలో పెనుదుమారంగా మారిన విషయం తెలిసిందే. ఆ ఘటన మరువకముందే మరో దారుణం చోటు చేసుకుంది. మైనర్లకు వాహనాలు ఇవ్వొద్దని అధికారుల ఎంత మోత్తుకున్న కూడా కొందరు మాత్రం అస్సలు జాగ్రత్తలు తీసుకొవడంలేదు. దీంతో ఇతరుల ప్రాణాలు గాల్లొ కలిసిపొతున్నాయి. కొంత మంది కారుతో స్టంట్ లు చేస్తున్నారు. ఎదుటి వాళ్లను తమ డ్రైవింగ్ తో టెన్షన్ తెప్పిస్తున్నారు. ఇష్టమున్నట్లు వాహనాలు నడిపిస్తు, రాంగ్ రూట్ లలో వెళ్లిపోతున్నారు. మైనర్ లు ఇటీవల కాలంలో ఎక్కువగా కారు ప్రమాదానికి కారణమౌతున్నారు. ఈ కోవకు చెందిన ఘటన ప్రస్తుతం వైరల్ గా మారింది.
పూర్తి వివరాలు..
ఉత్తర ప్రదేశ్ లోని కాన్పూర్ లో దారుణం చోటుచేసుకుంది. మైనర్ బాలుడు స్కూల్ కు డుమ్మా కొట్టి మరీ కారును బైటకు తీసి నడిపించాడు. అతడితో పాటు కారులో ఇద్దరు మైనర్ అమ్మాయిలు కూడా ఉన్నట్లు కూడా తెలుస్తోంది. అతగాడు తన కారు తీసుకుని స్టంట్ లు చేయడం ప్రారంభించాడు. ఇంతలో.. అతనికి కారు కంట్రోల్ కాలేదో.. మరేంటోకానీ.. ఒక్క సారిగా కారు వేగాన్నినియంత్రించలేకపోయాడు.
అది వేగంగా వెళ్లి ఎదురుగా వస్తున్న స్కూటీనీ బలంగా ఢీకొట్టింది. దీంతో వారు గాల్లో ఎగిరికిందపడ్డారు. వెంటనే స్థానికులు వాళ్లను హస్పిటల్ కు తరలించారు. ఈ ఘటనలో తల్లి అక్కడికక్కడే చనిపోయింది. అదే విధంగా కూతురు పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. స్థానికులు కారులో ఉన్న మైనర్లను పోలీసులకు అప్పగించారు. దీంతో ప్రస్తుతం ఈ ఘటన సంచలనంగా మారింది.
కారు ప్రమాదం జరిగినప్పుడు.. 100 కిమీల స్పీడ్ తో ఉన్నట్లు కూడా తెలుస్తోంది. ప్రమాదానికి కారణమైన బాలుడిని, అతని స్నేహితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలుస్తోంది.ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter
Kanpur speeding Car: ఒళ్లు గగుర్పొడిచే వీడియో.. 100 కిమీల వేగంతో స్కూటీని ఢీకొన్నకారు.. అసలేం జరిగిందంటే..?
కొంప ముంచి మైనర్ బాలుడి స్టంట్ లు..
సీరియస్ అయిన స్థానికులు..