Old Couple Love Marriage: వయసు మీద పడడం.. కుటుంబీకులు పోషించకపోవడంతో వృద్ధాశ్రమంలో చేరారు. అలా చేరిన క్రమంలో వారి మధ్య జరిగిన పరిచయం ప్రేమగా మారింది. జీవిత చరమాంకంలో ఒకరినొకరు అర్థం చేసుకుంటూ వృద్ధాశ్రమాన్నే ప్రేమాలయంగా చేసుకున్నారు. కష్టకాలంలో తనకు ప్రేమతో సపర్యలు చేయడంతో ఆరోగ్యం మెరుగైంది. అంతటి ప్రేమ చూపిన ఆమెను ఓ వృద్ధ ప్రేమికుడు వివాహం చేసుకున్నాడు. 68 ఏళ్ల వయసులో జరిగిన వీరి ప్రేమ వివాహం తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.
Also Read: Sreemukhi: మరో వివాదంలో శ్రీముఖి.. ఇంద్రకీలాద్రిపై రీల్స్, ఫొటోషూట్‌తో హల్‌చల్
ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రి లాలాచెరువు వద్ద స్వర్ణాంధ్ర వృద్ధాశ్రమం ఉంది. కడప జిల్లాకు చెందిన 68 ఏళ్ల గజ్జల రాములమ్మ ఈ ఆశ్రమంలో చేరింది. కుటుంబసభ్యులు పట్టించుకోకపోవడంతో రాజమండ్రి విచ్చేసి వృద్ధాశ్రమంలో కాలం వెళ్లదీస్తోంది. ఇదే ఆశ్రమంలో రాజమండ్రి మండలం నారాయణపురానికి చెందిన 64 ఏళ్ల మూర్తి రెండేళ్ల కిందట వచ్చి ఉంటున్నాడు. మూర్తికి పక్షవాతం రావడంతో రాములమ్మ అతడికి సపర్యలు చేయడంతో అతడు ఊహించని రీతిలో కోలుకున్నాడు. ఎంతో ప్రేమగా తనకు సపర్యలు చేయడం.. కంటికి రెప్పలా చూసుకోవడంతో మూర్తి ఆమెతో ప్రేమలో పడ్డాడు.
Also Read: Old 100 Note: లక్కంటే ఇదే! ఒకే ఒక వంద నోటుకు ఏకంగా రూ.56 లక్షలు
తనకన్న పెద్ద వయస్కురాలైన రాములమ్మపై మనసు పారేసుకోవడంతో ఈ విషయాన్ని స్వర్ణాంధ్ర వృద్ధాశ్రమ నిర్వాహకులకు చెప్పాడు. తొలుత వారు ఆశ్చర్యం వ్యక్తం చేయగా.. అనంతరం జరిగిన విషయం తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆశ్రమ నిర్వాహకుడు గుబ్బల రాంబాబు రాములమ్మ అభిప్రాయాన్ని కూడా తెలుసుకున్నారు. ఆమె కూడా మూర్తిని పెళ్లి చేసుకోవడానికి అంగీకరించింది. దీంతో నిర్వాహకులు వారి వివాహం జరిపించారు. ఆశ్రమంలోనే నిరాడంబరంగా తోటి వృద్ధుల మధ్య వారి వివాహం చేశారు.
అందరి సమక్షంలో ఇరువురు దండలు మార్చుకున్నారు. అనంతరం తోటి వృద్ధులు వారికి అక్షింతలు వేసి ఆశీర్వదించారు. అనంతరం ఆశ్రమ నిర్వాహకులు అభినందనలు తెలిపారు. ఈ వివాహం చేయడంతో నిర్వాహకులు రాంబాబు ఆనందం వ్యక్తం చేశారు. ఆశ్రమంలో నిరాశ్రయులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని తెలిపారు. ఈ వివాహం చేయడం తమకు ఎంతో ప్రత్యేకతగా నిలిచిందని చెప్పారు. వివాహానంతరం ఆ జంట ఆశ్రమంలోనే కొనసాగుతారని వెల్లడించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.