Kingfisher Beers: మద్యం మార్కెట్‌లో ఉన్న అత్యంత ప్రాచుర్యమైన బ్రాండ్ కింగ్ ఫిషర్. బీర్ మార్కెట్‌లో మేజర్ వాటా ఈ బ్రాండ్‌దే. మందుబాబులకు ముఖ్యంగా బీర్ అంటే ఇష్టపడేవారికి ఈ బ్రాండ్ చాలా ఇష్టం. అందుకే ఫుల్ డిమాండ్ ఉంటుంది. కానీ ఇకపై ఈ బ్రాండ్‌పై మందుబాబులు ఆశలు వదులుకోవల్సిందే.
కింగ్ ఫిషర్ బ్రాండ్‌ను ఉత్పత్తి చేస్తున్నది యునైటెడ్ బ్రేవరీస్ లిమిటెడ్ కంపెనీ. ఈ బ్రాండ్‌కు మార్కెట్‌లో చాలా డిమాండ్ ఉంది. వచ్చే వేసవికి సిద్ధం కావాలంటే ఇప్పట్నించే స్టాక్ సిద్ధం చేసుకోండి. ఎందుకంటే మార్కెట్‌లో కింగ్ ఫిషర్ బీర్లు అయిపోతున్నాయి. మరో 10-15 రోజుల్లో ఉన్న స్టాక్ ఖాళీ అవుతుంది. కొత్త స్టాక్ ఇకపై రాదు. ఎందుకంటే కింగ్ ఫిషర్ బీర్ కంపెనీ చేతులెత్తేసింది. బీర్ ధరలో 70 శాతం పన్నులే ఉంటున్నాయనేది కంపెనీ వాదన. ప్రభుత్వం తమకు 658 కోట్లు చెల్లించాల్సి ఉందని తెలిపింది. బీర్ల ధరలు పెంచుకునేందుకు ప్రభుత్వం నో చెప్పడంతో కంపెనీ కింగ్ ఫిషర్ బీర్ల ఉత్పత్తి నిలిపివేసింది. దాంతో మార్కెట్‌లో డిమాండ్ పెరిగింది. ఇప్పుడున్న స్టాక్ మరో పది పదిహేను రోజుల్లో ఖాళీ కానుంది.
మరి వచ్చే వేసవి దాహం తీరేది ఎలా అనే ఆందోళన పట్టుకుంది మందుబాబులకు. ఎందుకంటే వేసవి వచ్చిందంటే చాలు బీర్లకు డిమాండ్ అధికంగా ఉంటుంది. ముఖ్యంగా కింగ్ ఫిషర్ బ్రాండ్‌కు. అందుకే ఇప్పుడు ప్రభుత్వం కంపెనీతో చర్చలు జరుపుతోంది. ఈ చర్చలు సఫలమైతేనే కింగ్ ఫిషర్ బీర్ మళ్లీ మార్కెట్‌లో కన్పిస్తుంది. లేకపోతే అంతే. కింగ్ ఫిషర్ స్థానంలో కొత్త బ్రాండ్లు కన్పించవచ్చు.
మరి వేసవిలో కిక్కిచ్చే కింగ్ ఫిషర్ బీర్ కన్పించదంటే మందుబాబులు షాక్ అవుతున్నారు. అలవాటయిన బీర్ దొరక్కపోతే ఎలా అంటున్నారు. కింగ్ ఫిషర్ బీర్లలో కింగ్ ఫిషర్ స్ట్రాంగ్, కింగ్ ఫిషర్ లాగర్, కింగ్ ఫిషర్ అల్ట్రా ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. ఇవి ఫిబ్రవరి నుంచి కన్పించవు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.