King Kobra vs Python Fight: కింగ్ కోబ్రా, కొండచిలువ మధ్య ఫైట్.. చివరికి ఏది గెలిచిందంటే? ఒళ్లు గగుర్పొడిచే వీడియో

Viral Video, Big King Kobra attacks Python in Canal. ఓ భారీ కింగ్ కోబ్రా, కొండచిలువ మధ్య ఓ చిన్న నీటి కాల్వలో భీకర పోరాటం జరిగింది. ఇందుకు సంబందించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.   

Written by - P Sampath Kumar | Last Updated : Oct 29, 2022, 09:33 AM IST
  • కింగ్ కోబ్రా, కొండచిలువ మధ్య ఫైట్
  • చివరికి ఏది గెలిచిందంటే
  • ఒళ్లు గగుర్పొడిచే వీడియో
King Kobra vs Python Fight: కింగ్ కోబ్రా, కొండచిలువ మధ్య ఫైట్.. చివరికి ఏది గెలిచిందంటే? ఒళ్లు గగుర్పొడిచే వీడియో

King Kobra vs Python Fight Viral Video: సోషల్ మీడియా ప్రపంచంలో నిత్యం ఎన్నో వీడియోలు వైరల్ అవుతుంటాయి. ఇటీవలి కాలంలో ఎక్కువగా పాములకు సంబందించిన వీడియోస్ చక్కర్లు కొడుతున్నాయి. వాటిలో కొన్ని వీడియోలు ఫన్నీగా ఉంటే.. మరికొన్ని ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. ఇంకొన్ని వీడియోస్ మాత్రం భయభ్రాంతులకు గురిచేన్నాయి. అలాంటి వీడియోనే ఒకటి ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఓ భారీ కింగ్ కోబ్రా, కొండచిలువ మధ్య భీకర పోరాటం జరిగింది. 

వీడియో ప్రకారం... ఓ చిన్న నీటి కాల్వలో భారీ కింగ్ కోబ్రా, చిన్నపాటి కొండచిలువ ఎదురుపపడతాయి. ముందుగా కాలువ పై ఉన్న  కింగ్ కోబ్రా.. కొండచిలువపై దాడి చేస్తుంది. దాంతో కొండచిలువ పారిపోతుంది. మరలా తిరిగి రావడంతో రెండు పాములు ఒకదానిపై మరొకటి దాడికి దిగుతాయి. కొండచిలువను కింగ్ కోబ్రా పలుమార్లు కాటువేస్తుంది. దాంతో కొండచిలువ కింగ్ కోబ్రాను చుట్టుకొని దాడి చేస్తుంది. కింగ్ కోబ్రాకు తల దొరకకుండా కొండచిలువ తప్పించుకుని మరీ ఎదురుదాడి చేస్తుంది. 

కొండచిలువ చుట్టేసినా.. భారీ కింగ్ కోబ్రా దాన్ని క్రూరంగా కరుస్తూ దాడి చేస్తుంది. కొన్ని నిమిషాల పాటు రెండింటి మధ్య భీకర పోరాటం జరుగుతుంది. కింగ్ కోబ్రా దాడిని తట్టుకోలేక పోయిన కొండచిలువ.. అక్కడి నుంచి దూరంగా వెళ్లిపోతుంది. దాంతో కింగ్ కోబ్రా కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇందుకు సంబందించిన వీడియోను 'nurhidayat hdy' అనే యూట్యూబ్ ఛానెల్ ఆప్ లోడ్ చేసింది. ఈ వీడియో మూడు నెలల కిందదే అయినా.. ఇప్పుడు మరోసారి వైరల్ అవుతోంది. ఈ వీడియోకి ఇప్పటికే 75,907 వ్యూస్ వచ్చాయి. ఈ వీడియో పై మీరు ఒక లుక్కేయండి.

Also Read: దురదృష్టానికి బ్రాండ్ అంబాసిడర్ దక్షిణాఫ్రికా.. ప్రొటీస్‌కు కలిసిరాని ఐసీసీ టోర్నీ మ్యాచ్‌లు ఇవే!

Also Read: Weight Loss Juice: మధుమేహం, స్థూలకాయం సమస్యలకు కేవలం 12 రోజుల్లో చెక్‌ పెట్టొచ్చు.. ఎలాగో తెలుసా..?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News