Snake Catcher caught Big Black King Cobra Neck: ప్రపంచంలో అత్యంత విషపూరితమైన పాములలో నాగు పాము లేదా కింగ్ కోబ్రా ఒకటి. ఇది కాటు వేసిన నిమిషాల్లో మనిషి ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. ఈ పాములు సాధారణంగా భారతదేశంలో లేదా పొరుగు దేశాలలో కనిపిస్తాయి. ఎక్కువగా అడవుల్లో కనిపించే కింగ్ కోబ్రా.. అప్పుడపుడు మాత్రమే జనావాసాల్లోకి వస్తాయి. అలా వచ్చినపుడు జనాలు వీడియో తీయడంతో సోషల్ మీడియాలో కింగ్ కోబ్రా వీడియోలు వైరల్ అవుతాయి. తాజాగా వైరల్ అవుతోన్న ఓ వీడియోలో ఒక వ్యక్తి తన ఒట్టి చేతులతో కింగ్ కోబ్రా మెడను పట్టుకున్నాడు. ఈ షాకింగ్ వీడియో చూసిన వీక్షకులు ఆ వ్యక్తిపై మండిపడుతున్నారు.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ప్రకారం... ఓ ఇంట్లోకి భారీ సైజ్ ఉన్న బ్లాక్ కింగ్ కోబ్రా వస్తుంది. కింగ్ కోబ్రాను చూసిన ఆ ఇంట్లోని వారు ఒక్కసారిగా హడలిపోతారు. వెంటనే స్నేక్ క్యాచర్‌కు సమాచారం ఇస్తారు. స్నేక్ క్యాచర్ ఇంటికి వచ్చేసరికి పాము బయట సంచరిస్తుంటుంది. బుసలు కొడుతున్న దాన్ని స్నేక్ క్యాచర్ అదుపు చేస్తాడు. స్టిక్ సాయంతో బ్లాక్ కింగ్ కోబ్రాను అతడు పూర్తిగా తన ఆధీనంలోకి తీసుకొస్తాడు. ఆపై వెనకాల నుంచి వచ్చి పడగ విప్పిన పాము మెడను ఒక్కసారిగా పెట్టేస్తాడు. దాంతో ఆ పాము నొప్పితో విలవిలలాడిపోతుంది.
ఇందుకు సంబందించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోని ఇన్‌స్టాగ్రామ్‌లో 'నిక్ ది రాంగ్లర్' (nickthewrangler) అనే యూసర్ షేర్ చేశారు. ఈ వీడియోను 8 వారాల క్రితం పోస్ట్ చేయగా... ఇప్పటికీ వైరల్ అవుతోంది. ఈ వీడియోకి లైకుల, కామెంట్ల వర్షం కురుస్తోంది. వీడియో చూసిన చాలా మంది స్నేక్ క్యాచర్‌పై మండిపడుతున్నారు. కింగ్ కోబ్రా మెడను గట్టిగా పట్టుకోవడంపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కింగ్ కోబ్రా \ విషపూరితమైనప్పటికీ.. ఇలా వ్యవహరించకూడదని కామెంట్స్ చేస్తున్నారు. ఇంకొంత మంది ఒక విషపూరితమైన పామును అంత ఆత్మవిశ్వాసంతో మరియు నైపుణ్యంతో పట్టుకోవడంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook.