Video Viral: గూస్ బంప్స్ తెప్పిస్తున్న వీడియో... హనుమాన్ చాలీసా విని కదిలిన గర్భంలోని శిశువు..

Baby kicks stomach video: గర్భంలోని శిశువు హనుమాన్ చాలీసా విని కదలడం స్టార్ట్ చేశాడు. అతను తల్లపొట్టలో నుంచి కదిలిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.  

Written by - Inamdar Paresh | Last Updated : Jan 18, 2025, 06:54 PM IST
  • కదిలిన మహిళ పొట్టలోని శిశువు..
  • వైరల్ గా మారిన వీడియో..
Video Viral: గూస్ బంప్స్ తెప్పిస్తున్న వీడియో... హనుమాన్ చాలీసా విని కదిలిన గర్భంలోని శిశువు..

Baby kicks inside stomach when her mother listen hanuman chalisa: చాలా మంది మహిళలు ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు ఇష్టమైన సంగీతం వింటు ఉంటారు. మరికొందరు నచ్చిన పుస్తకాలు చదువుతుంటారు. అంతే కాకుండా.. తమకు ఇష్టమైన దేవుళ్ల పాటలు , స్తోత్రాలు వింటు ఉంటారు. ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు ఏ విధంగా ఆలోచిస్తామో.. పనులు చేస్తామో పుట్ట బోయే బిడ్డ మీద అదే ప్రభావం ఉంటుందని చాలా మంది చేప్తుంటారు. అందుకే గర్భందాల్చిన మహిళలు ఎంతో జాగ్రత్తగా ఉంటారు. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం ఒక వీడియో సోషల్ మీడియాలో తెగవైరల్ గా మారింది.

 

ఒక మహిళ గర్భందాల్చింది. అయితే.. ఆమె కడుపులో బిడ్డా క్రమంగా పెరుగుతున్నాడు.ఈ నేపథ్యంలో ఆమెకు చిన్నప్పటి నుంచి ఎంతో  భక్తి పాటలు వినేది. ప్రెగ్నెంట్గా ఉన్న సమయంలో సైతం.. ఆమె దేవుడి పాటలను వింటు ఉండేది. ఈ క్రమంలో ఆమె ప్రతి రోజు హనుమాన్ చాలీసా వింటు ఉండేది. మరీ ఆమె కడుపులోని బిడ్డ సైతం.. హనుమాన్ కు భక్తుడు అయిపోయినట్లున్నాడు.  ఆ హనుమాన్ చాలీసా పట్ల ఎంతగా ప్రభావితమయ్యాడంటే.. కడుపులో ఉన్న శిశువు సైతం హనుమాన్ చాలీసా స్తోత్రం పెడితే కడుపులో నుంచి కదలడం స్టార్ట్ చేశాడు.

 అయితే.. సదరు మహిళ ఇతర పాటల వీడియో పాటలు పెడితే.. శిశువు రెస్పాండ్ కాలేదు. కానీ గర్భంలోని శిశువు మాత్రం.. హనుమాన్ చాలీసా పెట్టగానే.. కడుపులోని శిశువు కదలడం స్టార్ట్ చేశాడు. కడుపులోని బిడ్డ కాలితో తన్నుతూ..ఉండటంను ఆమె స్వయంగా ఇంట్లో వాళ్లకు చూపించింది.

Read more: Viral Video: కారులో ప్రియుడితో అడ్డంగా దొరికిపోయిన భార్య ..!..సినిమా రేంజ్‌లో భర్త ఛేజింగ్.. వీడియో ఇదే..

తొలుత దీన్ని కొంత మంది నమ్మలేదు. కానీ స్వయంగా ఆమె హనుమాన్ చాలీసా పెట్టి మీర తన కడుపులోకి బిడ్డ కదలికల్ని చూపించింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు.. జై శ్రీరామ్ అంటూ భక్తితో పొంగిపోయారు.  మరికొందరు ఆ శిశువుకు భూమిపైకి రాకముందే హనుమంతుడి ఆశీస్సులు లభించాయంటూ పొంగిపోతున్నారు.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.FacebookTwitter

Trending News