Harish Rao on Hyderabad Real Estate: కాంగ్రెస్ పాలనలో రైతులు, చేనేత కార్మికులు, ఆటో డ్రైవర్లు.. ఇప్పుడు బిల్డర్లు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. BRS పాలనలో నిర్మాణ రంగానికి స్వర్గధామంగా హైదరాబాద్ ఉందన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఫ్లాట్లు అమ్ముడు పోలేదని బిల్డర్ ఉరేసుకునే పరిస్థితి రావడం శోచనీయమన్నారు. ఈ ఆత్మహత్యలన్నిటికీ ప్రత్యక్షంగా.. పరోక్షంగా కాంగ్రెస్ నిర్లక్ష్య పాలన, అనాలోచిత అసమర్థ విధానాలే కారణమని విమర్శించారు. రాష్ట్రంలో శాంతి భద్రత దిగజారయని.. పాలన పట్ల ప్రజల్లో నమ్మకం లేదన్నారు.
అనుమతి ఉన్న ఇళ్లను సైతం హైడ్రా కూల్చివేసిందని హరీష్ రావు ఫైర్ అయ్యారు. మూసీ, ఫార్మా సిటీ, మెట్రో కారిడార్ల విషయంలో ద్వంద్వ ప్రకటనలు చేసిందని.. రాష్ట్రంలో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ చేయలేదన్నారు. భవన నిర్మాణ అనుమతులకు బలవంతంగా వసూళ్లు చేస్తోందని ఫైర్ అయ్యారు. రాష్ట్రానికి కొత్త పెట్టుబడులు రావడం లేదన్నారు. ఇతర రాజకీయ, ఆర్థిక పరిణామాలు రియల్ ఎస్టేట్ రంగంపై గత 14 నెలలుగా తీవ్ర ప్రభావాన్ని చూపించాయని మాజీ మంత్రి అన్నారు.
ఒకప్పుడు హైదరాబాద్ అంటే రియల్ ఎస్టేట్ రంగంలో బిల్డర్లకు స్వర్గధామంగా ఉండేదన్నారు హరీష్ రావు. ఇప్పుడు బిల్డర్లకు నరకకూపంగా మారిందన్నారు. తాను రియల్ ఎస్టేట్ రంగం నుంచి వచ్చానని.. తనకే రియల్ ఎస్టేట్ గురించి చెప్తారా..? అని దబాయించే రేవంత్ రెడ్డి.. అనాలోచిత నిర్ణయాలతో చేజేతులా రియల్ ఎస్టేట్ రంగాన్ని నాశనం చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ అభివృద్ధికి ఇరుసుగా ఉన్న వ్యవసాయ రంగాన్ని, పారిశ్రామిక రంగాలు ధ్వంసం అయ్యాయని.. హైదరాబాద్ గ్రోత్ ఇంజిన్ అయిన రియల్ ఎస్టేట్ రంగం కుదేలైపోయిందన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ సర్కార్ మేల్కోకపోతే పదేళ్లుగా పురోభివృద్ధిలో ఉన్న తెలంగాణ.. తిరోగమనం బాట పట్టే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
Also Read: Vehicle Insurance: వాహనదారులకు బిగ్ అలర్ట్.. బీమా లేకపోతే పెట్రోల్, డీజిల్ బంద్
Also Read: Madha Gaja Raja: 12 సంవత్సరాల తర్వాత విడుదలైన మదగదరాజ.. ఎలా ఉందంటే..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.