Economic Survey: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు నేటి నుంచి ప్రారంభమయ్యాయి. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి 1న పార్లమెంట్ లో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నది. ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ను పార్లమెంట్ కు సమర్పించనున్నారు. బడ్జెట్ కు ముందు రోజు అంటే శుక్రవారం ఆర్ధిక మంత్రి పార్లమెంట్ లో సర్వేను ప్రవేశపెట్టారు. ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగం తర్వాత ఆర్థిక సర్వేను పార్లమెంట్ కు సమర్పించారు.
గత ఏడాది దేశ ఆర్థిక పనితీరును రాబోయే సంవత్సరంలో ఆర్థికంగా ఎదురయ్యే సవాళ్లను ముందుగానే అంచనా వేసి చెప్పేదే ఆర్థిక సర్వే. ఏటా దీని ఆధారంగానే కేంద్ర బడ్జెట్ రూపకల్పన ఉంటుంది. ఆర్ధిక మంత్రిత్వశాఖ రూపొందించే ఈ సర్వే రానున్న రోజుల్లో దేశం ముందున్న సవాళ్లు, వాటిని ఎదుర్కొనడానికి తీసుకోవాల్సిన చర్యలను ముందుగానే అంచనా వేసి పలు సూచనలను చేస్తుంది.
Also Read: Vehicle Insurance: వాహనదారులకు బిగ్ అలర్ట్.. బీమా లేకపోతే పెట్రోల్, డీజిల్ బంద్
ఆర్థిక సర్వేను ఆర్థిక మంత్రిత్వశాఖను పరిధిలోకి వచ్చే ఆర్థిక వ్యవహారాల శాఖ తయారు చేస్తుంది. గత ఏడాదిలో భారత దేశ ఆర్థిక స్థితిని క్షుణంగా పరిశీలించేందుకు ఈ సర్వే ను తయారు చేశారు. ముఖ్యమైన పరిశ్రమలు, వ్యవసాయం, సర్వీసెస్ గురించి డేటాను అందించడంతోపాటు ముఖ్యమైన ఆర్థిక ఇండికేటర్స్ ను మూల్యాంకనం చేస్తుంది. ఆర్థిక సర్వే సాధారణంగా రెండు విభాగాలుగా తయారువుతుంది. తొలిభాగంలో ఆర్థిక ధోరణులు, ఆర్ధిక అభివ్రుద్ధి, రంగా పనితీరుపై దృష్టి పెడుతుంది. రెండోది పేదరికం , ఆరోగ్య సంరక్షణ, విద్య పర్యావరణ ఆందోళనలు, వాణిజ్య సమతుల్యత విదేశీ మారక నిల్వలు వంటి ఆర్థిక అంచనాలపై ఫోకస్ పెడుతుంది.
Also Read: Madha Gaja Raja: 12 సంవత్సరాల తర్వాత విడుదలైన మదగదరాజ.. ఎలా ఉందంటే..?
ఇక ఆర్ధిక సర్వేను ప్రధాన ఆర్థిక సలహాదారు నాయకత్వంలో తయారు అవుతుంది. సీఈఏ, ఆర్థికవేత్తలు, విశ్లేషకుల బృందంతో కలిసి పలు విభాగాలు, పరిశోధనా సంస్థలు, అంతర్జాతీయ సంస్థల నుంచి డేటాను సేకరించి వివరణాత్మక వేదికను రూపొందిస్తుంది. నివేదిక తయారయ్యాక బడ్జెట్ కు ఒక రజు ముందు పార్లమెంట్ లో ఈ ఆర్ధిక సర్వేను ప్రవేశపెడతారు. 1950-51 సంవత్సరంలో తొలిసారిగా ఆర్థిక సర్వేను పార్లమెంట్ లో ప్రవేశపెట్టారు. బడ్జెట్ రోజునే సభలో ప్రవేశపెట్టేవారు. 1964 నుంచి బడ్జెట్ కు ముందు రోజు సమర్పిస్తున్నారు. ప్రస్తుతం అప్పటి నుంచి ఇప్పటి వరకు అదే సంప్రదాయం కొనసాగుతోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.