Ali Reza Grey బ్లాక్ అండ్ వైట్ సినిమాలంటే ఏంటో ఇప్పటి తరానికి తెలిసి ఉండకపోవచ్చు. ఒకప్పుడు బ్లాక్ అండ్ వైట్ సినిమాలే అందరికీ ఆదారం. కలర్ పిక్చర్స్ వంటి ఓ మూడు నాలుగు దశాబ్దాలు అవుతున్నాయి. అయితే అంతకు ముంద మాత్రం బ్లాక్ అండ్ వైట్ పిక్చర్స్ రాజ్యమేలాయి. మన దేశంలో బ్లాక్ అండ్ వైట్ చిత్రాలు ఇప్పుడు ఎక్కడా కనిపించవు. కానీ తెలుగులో మళ్లీ ఇప్పుడు బ్లాక్ అండ్ వైట్‌లో గ్రే అనే సినిమా వచ్చి ప్రత్యేకంగా నిలిచింది.
అరవింద్ కృష్ణ, అలీ రెజా, ప్రతాప్ పోతన్, ఊర్వశీరాయ్ వంటి వారు నటించిన ఈ గ్రే సినిమాను రాజ్ మదిరాజు తెరకెక్కించాడు. అద్వితీయ మూవీస్ ప్రై.లి పతాకంపై ప్రొడక్షన్ నెం.1గా కిరణ్ కాళ్లకూరి ఈ చిత్రాన్ని నిర్మించారు. పలు అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్స్‌కు ఎంపికైన ఈ మూవీ మే 26న థియేటర్లోకి వచ్చింది. ఈ స్పై, సస్పెన్స్ థ్రిల్లర్ ఈ వారం వచ్చిన అన్ని చిత్రాల్లో ప్రత్యేకంగా నిలిచింది.
అసలే ఈ వారం చిన్న చిత్రాలు ఎక్కువగా థియేటర్లోకి వచ్చాయి. మేమ్ ఫేమస్, మళ్లీ పెళ్లి, మెన్ టూ వంటి సినిమాలతో పాటుగా ఈ బ్లాక్ అండ్ వైట్‌లో తెరకెక్కించిన గ్రే సినిమా రావడంతో కాస్త రీ ఫ్రెష్ ఫీలింగ్ వచ్చినట్టు అయింది. కథ, కథనాలు కూడా ఆసక్తికరంగానే ఉండటంతో గ్రే ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది.
Also Read: Mem Famous Review: మహేష్ మెచ్చిన మేం ఫేమస్ రివ్యూ & రేటింగ్.. ఎలా ఉందంటే?
కొన్నేళ్ల క్రితం మనదేశంలో రెండేళ్ల వ్యవధిలో దాదాపు 12మంది న్యూక్లియర్ సైంటిస్టులు కనపడకుండా పోవడం, ఆ పాయింట్ మీద సినిమా తెరకెక్కడం అందరికీ తెలిసిందే. దాదాపు 40 ఏళ్ల తర్వాత బ్లాక్ అండ్ వైట్‌లో వస్తున్న చిత్రమని,. దానికోసం అన్ని అంశాలను రీసెర్చ్ చేయడం జరిగిందని మేకర్లు చెప్పిన సంగతి తెలిసిందే. ఈ సినిమా పీవీఆర్ పిక్చర్స్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే.
Also Read: Malli Pelli Movie Review: నరేష్-పవిత్రాల మళ్లీ పెళ్లి రివ్యూ అండ్ రేటింగ్.. సినిమా ఎలా ఉందంటే?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK