Big King Cobra Catching: గాయపడి ఆగ్రహంతో ఉన్న 20 అడుగుల కింగ్ కోబ్రా.. ప్రాణాలకి తెగించి పట్టుకున్న స్నేక్ క్యాచర్స్

Big King Cobra Viral Video: ప్రకృతిలో ప్రతి జంతువుకు సంబంధించిన కదలికలు సోషల్ మీడియాలో వీడియోలుగా వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా పాములకు సంబంధించిన వీడియోలైతే తెగ వైరల్ గా మారుతున్నాయి. అయితే ఈరోజు ఏ వీడియో వైరల్ గా మారిందో మీరే చూడండి.

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 24, 2023, 04:21 PM IST
Big King Cobra Catching: గాయపడి ఆగ్రహంతో ఉన్న 20 అడుగుల కింగ్ కోబ్రా.. ప్రాణాలకి తెగించి పట్టుకున్న స్నేక్ క్యాచర్స్

20 Feet King Cobra Video Viral: సోషల్ మీడియాలో జంతువులకు సంబంధించిన వీడియోల కంటే ఎక్కువగా ఏ వీడియోలు వైరల్ కావు. అయితే ఇటీవలే జంతువుల వీడియోలతో పాటు పాములకు సంబంధించిన వీడియోలు కూడా నెట్టింట్లో తెగ వైరల్ గా మారుతున్నాయి. కొందరు పాముల వీడియోలను ఆసక్తిగా చూస్తుంటే మరికొందరు భయాందోళనలు చెందుతున్నారు. పాములు మనుషులకు హాని చేసినప్పటికీ.. ప్రకృతికి మాత్రం ఎంతో కావాల్సినవి. పాములల్లో ప్రస్తుతం కోట్ల రకాల జాతుల్లో భూమిపై జీవిస్తున్నాయి. అందులో మనుషులకు హాని చేసేవి కొన్ని అయితే ఎలాంటి హాని చేయకుండా ప్రకృతిలో జీవించేవి మరికొన్ని.. ప్రస్తుతం అందరికీ తెలిసిన పాములు అనకొండ, కింగ్ కోబ్రా పాములు మాత్రమే. అయితే ఈరోజు మీకు మేము ఓ అరుదైన పామును ఈ వీడియోలో చూపించబోతున్నాం. ఆ పామేంటో, ఆ పాముకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకుందాం..

సాధారణంగా అనకొండ పాములు భారీ శరీరంతో పొడవుగా ఉంటాయి. ఇవి అమాంతం మనుషులను, జంతువులను మింగేయగలుగుతాయి. ఇక ఈ పాముల ఆహారం విషయానికి వస్తే.. అడవుల్లో లభించే జంతువులను చంపితింటాయి. మీరు ఈ కింది వీడియోలో కూడా వారి శరీర ఆకృతి కలిగిన పామును చూడొచ్చు. ఈ వీడియోలో కొందరు స్నేక్ క్యాచర్స్ గుహలో దాగి ఉన్న పామును గమనించి, దానిని పట్టుకొని బయటికి తీసుకు వస్తారు. అయితే ఆ పాము కదలలేని స్థితిలో ఉండటం వల్ల వారిని ఏం చేయలేక పోతుంది. అలా బయటికి తీసుకువచ్చిన పామును ఓ లేడీ స్నేక్ క్యాచర్ చిన్న తాడుతో కొలిచే ప్రయత్నం చేస్తుంది. ఇలా ఆ భారీ పైథాన్ పాము కొలతను చూడగా 22 సెంటీమీటర్ల కు పైగానే ఉందని తెలుస్తోంది. 

ఇలా పాములు కొలిచిన తర్వాత సురక్షితమైన ప్రదేశంలో బయటకు వదులుతారు. దీంతో ఆపాము నెమ్మదిగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అయితే ఈ వీడియోను నిక్ వైల్డ్ లైఫ్ అనే యూట్యూబ్ ఛానల్ నుంచి పోస్ట్ చేశారు. ఈ వీడియోను మూడు నెలల్లోనే దాదాపు పది లక్షలకు పైగా వీక్షించగా 14వేల మంది లైక్ చేశారు. అయితే పాములు రక్షిస్తున్న చాలామంది ప్రకృతి ప్రేమికులైన స్నేక్ క్యాచెర్స్ ను సోషల్ మీడియా వినియోగదారులు కామెంట్ల రూపంలో అభినందనలు తెలుపుతున్నారు.

Also Read:  Taraka Ratna Death Live Updates: 'మోకిల' నివాసానికి చేరుకున్న తారకరత్న భౌతికకాయం..భోరున విలపిస్తున్న నందమూరి కుటుంబం

Also Read: Taraka Ratna Siva Devotee: శివుని భక్తునిగా నటించి శివరాత్రి రోజే శివైక్యం.. శివుని ఆన లేనిదే చీమైనా కుట్టునా!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News