Profitable Small Business Idea: తక్కువ పెట్టుబడితో లైఫ్‌ లాంగ్‌ భారీ ఆదాయం వచ్చే బిజినెస్‌.. నెలకు రూ. 3 లక్షలు సంపాదన

Pet Grooming Salon Business Idea: నేటి కాలంలో చాలా మంది బతకడానికి మాత్రమే కాకుండా ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి, సమాజంలో గుర్తింపు పొందడానికి సొంతంగా వ్యాపారాలను ప్రారంభిస్తున్నారు. చాలా మంది చదువుకున్నప్పటికీ సరైన ఉద్యోగాలు పొందలేకపోతున్నారు. దీనితో సొంతంగా ఏదైనా చేయడం మంచిదని భావిస్తున్నారు. సొంత వ్యాపారం చేయడం వల్ల ఆర్థికంగా మరింత స్వేచ్ఛ పొందవచ్చు. మరి మీరు కూడా సొంతంగా బిజినెస్‌ను స్టార్ట్ చేయాలని ఆలోచిస్తున్నారా? ఈ బిజినెస్‌ ఐడియా మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. 
 

1 /12

సొంత వ్యాపారాన్ని ప్రారంభించాలని అనుకుంటున్నారా? అయితే ఎలాంటి బిజినెస్‌ ప్రారంభించాలి? ఏ వ్యాపారాన్నికి మార్కెట్‌లో ప్రస్తుతం డిమాండ్‌ ఉంది అనే విషయాలు ముందుగా తెలుసుకోండి. 

2 /12

ఈరోజు మీరు తెలుసుకొనే వ్యాపారం పెట్ గ్రూమింగ్ బిజినెస్‌. ఇది నేటి మార్కెట్‌లో డిమాండ్ ఉన్న తక్కువ రిస్క్‌ ఉన్న వ్యాపారం. ఎలా ప్రారంభించాలి అనే వివరాలు తెలుసుకోండి.

3 /12

పెట్ గ్రూమింగ్  అనేది పెంపుడు జంతువుల జుట్టును కత్తిరించడం, స్నానం చేయడం వంటివి చేసే ఒక బిజినెస్. ప్రస్తుతం ఈ వ్యాపారం బాగా అభివృద్ధి చెందుతోంది.   

4 /12

చాలా మంది పెంపుడు జంతువులను తమ కుటుంబ సభ్యుల్లాగా చూసుకుంటారు. దీంతో వారి పెంపుడు జంతువుల సంరక్షణకు ఎక్కువ డబ్బు ఖర్చు చేయడానికి సిద్దంగా ఉంటారు.  

5 /12

పెంపుడు జంతువులపై చేసే ఖర్చు ప్రేమ, ఆప్యాయతతో సమానం కాదు. అవి మన జీవితంలో సంతోషాన్ని నింపుతాయి. మీరు కూడా పెట్‌ లవర్‌ అవుతే ఈ బిజినెస్‌ మీకు ఎంతో మంచి ఎంపిక.

6 /12

పెట్ గ్రూమింగ్ వ్యాపారాన్ని ప్రారంభిచే ముందు మీ లక్ష్యాలను, వ్యాపార ప్రణాళికను స్పష్టంగా నిర్వచించాలి. అందులో ముందుగా వ్యాపారం పరిధిని,సేవలను, ధరలను, మార్కెటింగ్ వ్యూహాన్ని నిర్ణయించండి.

7 /12

వ్యాపారాన్ని చిన్న స్థాయిలో ప్రారంభించవచ్చు క్రమంగా దానిని విస్తరించవచ్చు.  మీ ఇంటి నుంచి లేదా ఒక చిన్న దుకాణంలో వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు.

8 /12

 వ్యాపారాన్ని విజయవంతంగా నిర్వహించడానికి కొన్ని నైపుణ్యాలు,  జ్ఞానం చాలా అవసరం.  పెంపుడు జంతువుల గురించి  వాటి సంరక్షణ గురించి తెలిసి ఉండాలి. 

9 /12

మీకు మంచి కమ్యూనికేషన్ నైపుణ్యాలు, కస్టమర్ సర్వీస్ నైపుణ్యాలు ఉండాలి. పెట్ గ్రూమింగ్ వ్యాపారాన్ని ప్రారంభించడం చాలా లాభదాయకమైన అవకాశం.  

10 /12

మీ పెంపుడు జంతువుల ప్రేమను, మీ వ్యాపార నైపుణ్యాలను ఉపయోగించి విజయవంతమైన వ్యాపారాన్ని స్టార్ట్ చేయవచ్చు. ఈ బిజినెస్‌ ప్రారంభించడానికి మీకు రూ. 2,00,000 అవుతుంది. 

11 /12

మీ వద్ద పెట్టుబడి పెట్టడానికి డబ్బు లేకపోతే ప్రధాన మంత్రి ముద్ర యోజన పథకం కింద లోన్ తీసుకోవచ్చు. దీంతో మీరు వ్యాపారాన్నికి  కావాల్సిన వస్తువులను కొనుగోలు చేసుకోవచ్చు.   

12 /12

 ఈ వ్యాపారంతో మీరు నెలకు రూ. 40,000 సంపాదించవచ్చు. సంవత్సరానికి రూ. 480,000 సంపాదన. మీకు ఈ ఇడియా నచ్చితే మీరు ప్రారంభించండి.