Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 14 గంటల సమయం..

Tirumala Tirupati Devasthanam: తిరుమల శ్రీవారి దర్శనానికి నిత్యం వేల మంది క్యూలైన్లలో ఎదురు చూస్తుంటారు భక్తులు. అయితే, ప్రత్యేక దర్శనం, సర్వదర్శనం టోకెన్ల ఆధారం భక్తులకు శ్రీవారి దర్శనం కల్పిస్తారు. అయితే తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. ఈ నేపథ్యంలో శ్రీవారి దర్శనానికి దాదాపు 14 గంటల సమయం పడుతోందని టీటీడీ తెలిపింది. ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం..
 

1 /5

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉంది. భక్తులు క్యూకాంప్లెక్స్‌లలో బారులు తీరారు. ఈనేపథ్యంలో శ్రీవారి సర్వదర్శనానికి 14 గంటల సమయం పడుతుంది. 12 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.   

2 /5

తిరుమల తిరుపతి దేవస్థానం సమాచారం మేరకు నిన్న ఒక్కరోజే శ్రీవారిని 72,700 పైగా భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అందులో దాదాపు 24,156 మంది తలనీలాలు సమర్పించారు. ఇక నిన్న ఒక్కరోజూ హుండీ ఆదాయం రూ.3.45 కోట్లకుపైగా వచ్చిందని సమాచారం.  

3 /5

మార్చి 9 నుంచి స్వామివారి సాలకట్ల ఉత్సవాలు కూడా ఐదు రోజులపాటు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆరోజుల్లో ఆర్జిత్‌ సేవలు నిలిపివేయనున్నట్లు టీటీడీ తెలిపింది. ఈ తెప్పోత్సవం సమయంలో స్వామివారు కోదండ రాముడు, శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామిగా భక్తులు దర్శనం ఇవ్వనున్నారు.  

4 /5

ఇక ఫిబ్రవరి 18వ తేదీ నుంచి మే నెల కోటాకు చెందిన లక్కీ డిప్‌, ప్రత్యేక దర్శనం టోకెన్లు కూడా జారీ చేస్తోంది టీటీడీ. 22వ తేదీ నుంచి శ్రీవాణి టిక్కెట్లు కూడా జారీ చేయనున్నారు. ఇది కాకుండా వృద్ధులు, దివ్యాంగులకు ప్రత్యేక దర్శనం టోకెన్లు కూడా జారీ చేస్తారు.  

5 /5

తిరుమల ప్రత్యేక దర్శనం టోకెన్లు రూ.300 ఫిబ్రవరి 24వ తేదీ నుంచి మే నెల కోటాకు సంబంధించినవి విడుదల చేయనున్నారు. అదే రోజు మధ్యాహ్నం నుంచి గదుల బుకింగ్‌ కూడా అందుబాటులో ఉండనుంది. భక్తులు టీటీడీ అధికారిక వెబ్‌సైట్‌లో టోకెన్లు పొందవచ్చు.