GAIL Recruitment 2025: సర్కారీ నౌకరీ చేయడం మీ కల అయితే, గెయిల్ (GAIL) మీకు శుభవార్త చెప్పింది. జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసి తీపి కబురు అందించింది. ఈ రిక్రూట్మెంట్లో మీరు ఎంపికైతే కేంద్ర ప్రభుత్వ కొలువు మీ సొంతం. గెయిల్ ఈ నోటిఫికేషన్ ద్వారా ఎగ్జిక్యూటీవ్ ట్రెయినీ పోస్టులను భర్తీ చేయనుంది. ఆ పూర్తి వివరాలు ఇవే..
GAIL Recruitment 2025: మీరు ఈ పోస్టులకు దరఖాస్తు చేసే ముందు నోటిఫికేషన్ క్షుణ్నంగా చదవండి. ఆ తర్వాత అధికారిక వెబ్సైట్ అయిన gailonline.com దరఖాస్తు చేసుకోండి. ఈ పోస్టులకు అప్లికేషన్ ప్రక్రియ ప్రారంభం అయింది.
గెయిల్ ఈ నోటిఫికేషన్ ద్వారా 73 ట్రెయినీ పోస్టులను భర్తీ చేయనుంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి చివరితేదీ మార్చి 18. గెయిల్కు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు కావాల్సిన అర్హతలు ఇతర వివరాలు తెలుసుకుందాం.
గెయిల్ ఈ నోటిఫికేషన్ ద్వారా కెమికల్, ఇన్స్ట్రూమెంటేషన్, ఎలక్ట్రికల్, మెకానికల్, బీఐఎస్ (బిజినెస్ ఇన్ఫర్మేషన్ సిస్టం) విభాగాల్లో భర్తీ చేయనుంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు గరిష్టంగా 26 ఏళ్లు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ 5 ఏళ్లు, ఓబీసీ 3 ఏళ్లు, పీడబ్ల్యూబీడీ వారికి 10 ఏళ్ల ఏజ్ రిల్యాక్సేషన్ ఉంటుంది.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నవారిని గ్రాడ్యూయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్ (GATE-2025) స్కోర్ కార్డు ఆధారంగా ఎంపిక చేస్తారు. గెయిల్ ఇండియాకు ఎంపికైన అభ్యర్థులకు ఎగ్జిక్యూటీవ్ ట్రెయినీ పోస్టు అందిస్తారు. ఇందులో వారికి ప్రతి నెలా E-2 గ్రేడ్ రూ.60,000 నుంచి రూ.1,80,000 జీతం అందించనున్నారు.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు కొన్ని ధ్రువపత్రాలు కలిగి ఉండాలి. అధికారిక వెబ్సైట్లో ఆ వివరాలు ఉన్నాయి. గేట్ స్కోర్ కార్డు కలిగి ఉండాలి. దీంతోపాటు కుల ధ్రువీకరణ పత్రం, ఆధార్ కార్డు లేదా పాన్ కార్డు ఐడెంటిటీ గుర్తింపు.