Thandel 4 days Box Office collection: వర్కింగ్ డేలో కూడా మంచి హోల్డ్ చూపించిన నాగ చైతన్య ‘తండేల్’.. ఫస్ట్ బ్రేక్ ఈవెన్ ఏరియా ఇదే..

Thandel 4 days Box Office collection: యువ సామ్రాట్ నాగ చైతన్య కథానాయకుడిగా  సాయి పల్లవి హీరోయిన్ గా నటించిన చిత్రం ‘తండేల్’.   చందూ మొండేటి డైరెక్షన్ లో అల్లు అరవింద్ సమర్ఫణలో బన్నీ వాస్ తెరకెక్కించారు. పాజిటివ్ టాక్ తో ప్రారంభమైన ఈ చిత్రం మొదటి మూడు రోజులు మంచి వసూళ్లనే కుమ్మేసింది. ఇక నాల్గో రోజైన సోమవారం ఈ సినిమా మంచి వసూళ్లనే రాబట్టింది. 

1 /6

Thandel 4 days Box Office collection: గత కొన్నేళ్లుగా నాగ చైతన్య హీరోగా నటించిన తండేల్ మూవీ ప్రమోషన్స్ తో ఈ సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి. ఆ అంచనాలను అందుకోవడంలో ఈ మూవీ సక్సెస్ అయింది. అది వసూళ్ల రూపంలో కనిపించింది. ఈ సినిమా మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా  రూ. 21 కోట్లకు పైగా వరల్డ్ వైడ్ గా గ్రాస్ వసూళ్లను రాబట్టి దుమ్ము లేపింది.

2 /6

ఇక రెండో రోజు కూడా ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాకు మంచి వసూళ్లనే కుమ్మేసింది. మొత్తంగా రెండో రోజు రూ. 41.20 కోట్ల గ్రాస్ వసూళ్లతో దుమ్ము దులిపింది. లవ్ కమ్ యాక్షన్, ఎమోషన్ తో కూడి దేశ భక్తి  చిత్రంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.

3 /6

మూడో రోజు రూ. 62.37 కోట్ల గ్రాస్ వసూళ్లలతో కుమ్మేసిన ‘తండేల్’ మూవీ సోమవారం కూడా మంచి హోల్డ్ చూపించింది. లవ్ స్టోరీ తర్వాత తండేల్ మూవీతో మరోసారి హిట్ పెయిర్ అనిపించుకున్నారు నాగ చైతన్య, సాయి పల్లవి. ఈ సినిమా ఫస్ట్ డే చైతూ  సోలో హీరోగా గత రికార్డులను బద్దలు కొట్టింది.

4 /6

అంతేకాదు నాగ చైతన్య కెరీర్ లో బిగ్గెస్ట్ గ్రాసర్ గా నిలిచే అవకాశాలున్నాయి.నాల్గో రోజు సోమవారం ఈ సినిమా మొత్తంగా రూ. 73.20 కోట్ల గ్రాస్ వసూళ్లు.. రూ 38 కోట్ల షేర్ తో బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకుంది.

5 /6

ముందుగా తెలంగాణలో రూ. 10.50 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలో దిగిన ఈ సినిమా నాల్గో రోజుల్లో రూ. 12 కోట్ల వరకు కలెక్షన్స్ రాబట్టి తండేల్ బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకున్న తొలి ఏరియాగా నిలిచింది. అంతేకాదు ఈ వీకెండ్ వరకు ఈ సినిమా రూ. 100 కోట్ల గ్రాస్ క్లబ్బులో ప్రవేశించనుంది.

6 /6

హీరోగా నాగ చైతన్యకు ఇది మొదటి రూ. 100కోట్ల చిత్రంగా నిలవనుంది.  ఈ చిత్రంలో  నాగ చైతన్య ‘తండేల్ రాజు’ పాత్రలో ఒదిగిపోయాడు. సాయి పల్లవి ‘సత్య’ పాత్రలో ఒదిగిపోయింది. వీరిద్దరి కెమిస్ట్రీకి ప్రేక్షకులు ఫిదా అయ్యారు.