Sun Saturn Yuti: హిందూ జ్య్యోతిష్యశాస్త్రంలో గ్రహాల కదలిక, రాశుల సంచారానికి విశేష ప్రాధాన్యత మహత్యం ఉంది. రెండు గ్రహాల సంయోగం అంటే కొన్ని రాశులకు దశ తిరిగినట్టే. గ్రహాలకు రారాజుగా బావించే సూర్యుడు కుంభ రాశిలో ప్రవేశించనున్నాడు. అప్పటికే శని ఇదే రాశిలో ఉండటంతో రెండు గ్రహాల కలయికతో యుతి ఏర్పడనుంది. ఫలితంగా 3 రాశులవారికి మహర్దశ పట్టనుంది. వద్దంటే డబ్బు వచ్చి పడుతుంది.
ధనస్సు రాశి ఈ రాశి జాతకులకు మహర్దశ పట్టనుంది. అనుకోని విధంగా పెద్దఎత్తున డబ్బులు లభిస్తాయి. ఆర్ధికంగా మంచి స్థితిలో ఉంటారు. పెట్టుబడులు లాభాల్ని ఆర్జించి పెడతాయి. ఉద్యోగులకు పదోన్నతి ఉంటుంది.
కన్యా రాశి ఉద్యోగులకు చాలా అనుకూలంగా ఉంటుంది. వేతనాలు భారీగా పెరగడంతో పాటు పదోన్నతి లభిస్తుంది. తండ్రి నుంచి ఆర్ధిక సహకారం లభిస్తుంది. ఆర్ధికంగా పటిష్టంగా ఉంటారు.
వృషభ రాశి వృషభ రాశి జాతకులకు సూర్య, శని గ్రహాల యుతి కారణంగా చాలా ప్రయోజనం కలగనుంది. కొత్త ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. వ్యాపారులు అమితమైన లాభాలు ఆర్జిస్తారు. విద్యార్ధులకు కెరీర్ బాగుంటుంది. ఆకశ్మిక ధనలాభం కలుగుతుంది. ఆరోగ్యం కూడా కుదుటపడుతుంది.
కుంభ రాశికి అధిపతి శని ఇదే రాశిలో ఉండటంతో పాటు సూర్యుడు కలవడంతో మహాయుతి ఏర్పడింది. ఫలితంగా కొన్ని రాశులకు అదృష్టంగా మరి కొన్ని రాశులకు ప్రతికూలంగా ఉంటుంది.
Saturn Sun Conjunction 2025: ఫిబ్రవరి 12 అంటే ఇవాళ జాతక రీత్యా ప్రత్యేకతమైంది. ఇవాళ మాఘ మాసం పౌర్ణమి కూడా. శని, సూర్య గ్రహాల కలయికతో యుతి ఏర్పడనుంది. ఈ ప్రభావం ఇతర రాశులపై పడనుంది.