Sr NTR 29th Death Anniversary: సినిమాల్లో రాజకీయాల్లో ఎన్నో రికార్డులను తన పేరిట రాసుకున్నారు నందమూరి తారక రామారావు. తెలుగు సినీ ఇండస్ట్రీలో ఓ రేర్ రికార్డు క్రియేట్ చేసారు. ఈ రికార్డులను బ్రేక్ చేయడం భవిష్యత్తులో ఎవరికి సాధ్యం కాదు. కాబోదు.. ఇంతకీ ఏమిటా రికార్డులు అంటే..
Sr NTR 29th Death Anniversary: ఎన్టీఆర్ పేరే ఓ హిస్టరీ. ఈయన తన జీవితంలో దాదాపు 300 చిత్రాల్లో నటించారు. అందులో ఎక్కువగా ఈయన టైటిల్ రోల్లో యాక్ట్ చేసిన సినిమాలే ఎక్కువగా ఉన్నాయి.
నందమూరి తారక రామారావు తన 44 యేళ్ల సినీ కెరీర్లో 48 పౌరాణికాలు.. 18 చారిత్రక చిత్రాలు.. 55 జానపద సినిమాలు.. 186 సాంఘిక చిత్రాలు చేసారు. మరే హీరోకు ఇది కలలో కూడా సాధ్యం కాదు.
అప్పట్లోనే 50 దశకంలో ప్యాన్ ఇండియా లెవల్లో తెలుగు, తమిళం, హిందీలో 'చండీరాణి' సినిమా చేసారు అది కూడా భానుమతి దర్శకత్వంలోనే. అంతేకాదు నయా ఆద్మీ అనే బాలీవుడ్ సినిమాలో నటించారు. ఈ సినిమా తెలుగులో 'సంతోషం'పేరుతో తెరకెక్కింది.
ఆ సంగతి పక్కనపెడితే.. హీరోగా ఎన్టీఆర్ పనైపోయిందనుకున్న వాళ్లకు 1977లో తన సినిమాలతో గట్టి సమాధానమే ఇచ్చారు. ఆ యేడాది జనవరి 14తన స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన 'దాన వీర శూర కర్ణ' సినిమా తెలుగు సినీ ఇండస్ట్రీలో ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది.
అదే యేడాది ఏప్రిల్ 28న కే.రాఘవేంద్రరావు దర్శకత్వంలో తొలిసారి ఎన్టీఆర్ నటించిన 'అడవి రాముడు’ చిత్రం తెలుగు సినీ ఇండస్ట్రీలో కమర్షియల్ చిత్రాలుకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచింది. అన్నగారు అవుట్ డోర్ లో చేసిన తొలి చిత్రం. అంతేకాదు ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది.
ఇక 1977 అక్టోబర్ 21న రామారావు కథానాయకుడిగా తాతినేని రామారావు దర్శకత్వంలో తెరకెక్కిన 'యమగోల'మూడో ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది.
అసలు ఇండస్ట్రీని షేక్ చేసే సినిమాలు అరుదుగా వస్తుంటాయి. అలాంటిది ఒకే ఇయర్ మూడు చిత్రాలు ఒక దాన్ని మించి మరొకటి ఇండస్ట్రీ హిట్‌గా నిలవడం అనేది ఎన్టీఆర్ విషయంలో జరిగింది. మరే తెలుగు హీరోకు ఈ రికార్డు సాధ్యం కాలేదు. భవిష్యత్తులో సాధ్యం కాబోదు కూడా.
1977లో ఎన్టీఆర్ మూడు ఇండస్ట్రీ హిట్ మూవీస్‌తో పాటు చాణక్య చంద్రగుప్త, ఎదురీత, మా ఇద్దరి కథ వంటి మరో చిత్రాల్లో నటించారు. ఈ సినిమాలు కూడా ఓ మోస్తరు విజయాలు అందుకున్నాయి.
ఇక ఎన్టీఆర్ నటించిన చివరి చిత్రం ‘మేజర్ చంద్రకాంత్’. కానీ తెరపై విడుదలైన చివరి చిత్రం ‘శ్రీనాథ కవిసార్వభౌముడు’ కావడం విశేషం.