Silk Smitha: శృంగార తార సిల్క్ స్మిత 'ఒక రోజు'కు ఎంత తీసుకునేదో తెలుసా?

Silk Smitha Remuneration Details Shocking: అలనాటి టాప్‌ డ్యాన్సర్‌ సిల్క్ స్మిత గురించి ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. అద్భుతమైన పాటలకు అదిరిపోయే డ్యాన్స్‌తో మగాళ్లను మత్తెక్కించిన సిల్క్‌ స్మిత రెమ్యునరేషన్‌ అంశం తెలిసింది. తాను నటించాలనుకుంటున్న పాటకు ఎంత తీసుకునేదో బయటపడింది.

1 /6

రెండు దశాబ్దాల పాటు సినీ ప్రేక్షకులను తన మైకంలో ముంచెత్తిన తార ఎవరైనా ఉన్నారంటే అది కేవలం సిల్క్‌ స్మితనే. చిన్న సినిమా అయినా.. పెద్ద అయినా ఆమె బొమ్మ ఉంటే హిట్‌ పక్కా అనే స్థాయికి సిల్క్‌ స్మిత రేంజు ఉండేది. 

2 /6

సిల్క్ స్మిత అంటే ప్రేక్షకుల్లో యమ క్రేజీ. ఆమె కనుసైగకు గుండె గల్లంతయిన పురుషులు ఎందరో. సిల్క్‌ స్మిత కొరికిన ఆపిల్‌ను వేలానికి పెట్టినప్పుడు ఒక అభిమాని రూ.లక్షకు కొనుగోలు చేశాడు. అప్పట్లో రూ.లక్ష అంటే నేడు రూ.కోట్లలో ఉంటుంది. స్మిత డేట్ కోసం నిర్మాతలు, హీరోలు ఎదురుచూసేవారు.

3 /6

పేద కుటుంబంలో జన్మించిన స్మిత జీవితంలో అనేక కష్టాలు ఎదుర్కొంది. విను చక్రవర్తి దర్శకత్వంలో వచ్చిన 'వండి చక్రం' సినిమాలో సిల్క్ అనే పాత్రతో ఎంట్రీ ఇచ్చిన స్మిత అనంతరం సిల్క్ స్మితగా మారింది.

4 /6

సిల్క్ స్మిత చాలా సినిమా సెట్లలో ప్రమాదాలను ఎదుర్కొన్నారని దర్శకుడు వి శేఖర్ తెలిపారు. సిల్క్‌ సినిమా షూటింగ్‌లో జరిగిన ఒక సంఘటన గురించి కూడా ఆయన తెలిపారు. 'ఒక గ్రామంలో షూటింగ్‌ చేస్తుండగా స్మితకు అక్కడే ఒక ఇంట్లో వసతి కల్పించారు. స్మిత వచ్చారనే విషయం తెలుసుకుని చాలామంది షూటింగ్ లొకేషన్‌కి వచ్చారు' అని వివరించారు.

5 /6

'అప్పుడు ఒక రైతు ఎంత ఖర్చవుతుందని అడిగాడు. నేను సినిమా తీయడానికి ఎంత ఖర్చవుతుందని అడుగుతున్నారని భావించా. కానీ అతడు అడిగినది ఏమిటంటే సిల్క్ స్మితను ఒక రోజుకి కావాలంటే ఎంత చెల్లించాల్సి ఉంటుందని అడిగాడు' అని దర్శకుడు వి. శేఖర్ చెప్పినట్లు తెలుస్తోంది. ఈ వార్త సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది.

6 /6

ఇక ఒక పాటకు సిల్క్‌ స్మిత అప్పట్లోనే రూ.లక్ష నుంచి 3 లక్షలు తీసుకునేదని తెలుస్తోంది. అత్యంత ఎక్కువ పారితోషికం తీసుకునే హీరోయిన్లలో సిల్క్ స్మిత ఉన్నారు.