Stock Market Crash: భారత స్టాక్ మార్కెట్లు మంగళవారం కూడా భారీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. వరుసగా గత 5 సెషన్లో మార్కెట్ భారీగా నష్టపోయింది. మంగళవారం ఇంట్రా డే సెషన్ లో సెన్సెక్స్ 1200పాయింట్లు నష్టపోయింది. 77,000కంటే తక్కువ స్థాయికి చేరింది. నిఫ్టీ 50 కీలకమైన 23,000కన్నా దిగువకు చేరుకుంది.
Stock Market Crash: భారత స్టాక్ మార్కెట్లు మంగళవారం కూడా కుప్పకూలాయి. సెన్సెక్స్ 1200పాయింట్లకు పైగా నిఫ్టీ 400 పాయింట్లకు పైగా నష్టపోయింది. గత 5 సెషన్లలో సెన్సెక్స్ సుమారు 2500 పాయింట్లు నష్టాన్నిచూవిచూసింది. కొనసాగుతున్న విదేశీ మూలధన అమ్మకాలు, బలహీనమైన క్యూ 3 ఆదాయాలపై ఆందోళనలు ఆర్థిక వ్రుద్ది మందగించడం, దేశీయ కరెన్సీ డాలర్ తో పోలిస్తే అన్ని కాలాల కంటే తక్కువ స్థాయికి పడిపోవడం వంటి వాటి నేపథ్యంలో భారత స్టాక్ మార్కెట్ ఇటీవల అమ్మకాల ఒత్తిడికి లోనవుతోంది. భారత స్టాక్ మార్కెట్ ఎందుకు పడిపోతుందో చూద్దాం.
భారీ ఎఫ్బీఐ అమ్మకాలు అమెరికా బాండ్స్ పై లాభాలు పెరగడం, డాలర్ విలువ పెరగడం, త్వరలోనే ఫెడ్ రేట్ తగ్గించే అవకాశాలు తగ్గిపోవడం వంటి కారణాల వల్ల గత అక్టోబర్ నుంచి విదేశీ పెట్టుబడి దారులు భారత స్టాక్స్ ను పెద్దెత్తున అమ్ముతున్నారు. ఫిబ్రవరి 10 వరకు విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు నగదు విభాగంలో రూ. 12,643 కోట్ల విలువైన భారత స్టాక్స్ ను అమ్మారు. అక్టోబర్ నుంచి వారు భారత స్టాక్ మార్కెట్ నుంచి రూ. 2.75లక్షల కోట్లకు పైగా తీసుకున్నారు.
బలహీనమైన క్యూ3 రాబడులు భారతీయ కంపెనీల డిసెంబర్ త్రైమాసికం రాబడులు గత రెండు త్రైమాసికాల కంటే స్వల్పంగా మెరుగ్గా ఉన్నాయి. అయినప్పటికీ అవి అంచనాలను అందుకోవడంలో విఫలమయ్యాయి. అనేక స్టాక్స్ వాటి ఫండమెంటల్స్ కు మించి కదులుతున్నాయనే ఆందోళనలు కూడా పెరిగాయి. గత రెండు త్రైమాసికాల కంటే క్యూ3 రాబడులు స్వల్పంగా మెరుగ్గా ఉన్నాయి. అయితే వాల్యుయేషన్లు సూచించిన అంచనాలతో పోలిస్తే రాబడులు నిరాశాజనకంగా కొనసాగుతున్నాయి. కన్య్సూమర్ స్టేపుల్స్, ఆటోలు, బిల్డింగ్ మెటీరియల్స్ ఆశాజనకంగా ఉన్నాయని..స్పెషాలిటీ కెమికల్స్ కోలుకుంటున్నాయని మార్సెలస్ ఇన్వెస్ట్మెంట్ మేనేజర్స్ సహా వ్యవస్థాపకుడు ప్రమోద్ గుబ్బి తెలిపారు.
రూపాయి బలహీనత అమెరికా డాలర్ తో పోలిస్తే రూపాయి బలహీనపడడం మార్కెట్ ప్రతికూల సెంటిమెంట్ కు ప్రధాన కారణాల్లో ఒకటి. డాలర్ తో దేశీయ కరెన్సీ విలువ సోమవారం 88స్ధాయికి దగ్గర పడిపోయింది. ఈ ఏడాది డాలర్ తో పోలిస్తే రూపాయి విలువ దాదాపు 3శాతం పడిపోయింది. ఆర్బిఐ జోక్యం చేసుకుంటుందనే ఊహాగానాల మధ్య మంగళవారం ప్రారంభం ట్రేడింగ్ లో డాలర్ తో రూపాయి మారకం విలువ 61 పైసలు పెరిగి 86.84వద్ద ముగిసింది.
అధిక వాల్యుయేషన్స్ ఇటీవల కరెక్షన్ ఉన్నప్పటికీ భారత స్టాక్ మార్కెట్ ఇంకా ఖరీదైనదిగానే ఉందని నిపుణులు చెబుతున్నారు. ఆదాయ రికవరీ బలహీనమైన అంచనాలు సెంటిమెంట్ ను తక్కువగా ఉంచుతున్నాయి. వాల్యుయేషన్లు పెరిగాయని రాబడులు అప్పట్లో కోలుకునే అవకాశం లేదంటున్నారు.
వాణిజ్య యుద్ధం భయాలు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాణిజ్య భాగస్వామ్య దేశాలపై అనేక సుంకాలను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇది ప్రపంచ ఆర్థిక వ్రుద్ధిని దెబ్బతీసే, ద్రవ్యోల్బణాన్ని పెంచే విస్త్రుత వాణిజ్య యుద్ధంగా పరిణమించి మార్కెట్ ఆందోళలను మరింత పెంచేలా చేసింది. ఉక్కు, అల్యుమినియం దిగుమతులపై ట్రంప్ 25శాతం సుంకం విధించారని ఇది కెనడా, మెక్సికోలపై ఎక్కువగా ప్రభావం చూపుతుందని భావిస్తున్నారు. అమెరికా టారిఫ్స్ పై అనిశ్చితి ప్రపంచ ఆర్థిక వ్రుద్ధిపై వాటి ప్రభావం పెట్టుబడి దారులను రిస్క్ ఈక్విటీల పట్ల అప్రమత్తంగా ఉంచాయి.