Tirumala: మార్చి 9 నుంచి శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు.. ఆ 5 రోజులు ప్రత్యేక సేవలు బంద్

Tirumala Salakatla Teppotsavam: తిరుమల శ్రీ వేంకటేశుని సాలకట్ల తెప్పోత్సవాల్లో భాగంగా ఐదు రోజులు ఆర్జిత సేవలు బంద్‌ కానున్నాయి.. ఈ ఉత్సవాలు మార్చి 9 నుంచి 13 వరకు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. ఇటీవల ప్రత్యేక దర్శనం ఆర్జిత సేవలు మే నెలకు సంబంధించిన కోటా విడుదల చేసిన తిరుమల తిరుపతి దేవస్థానం.. తాజాగా వచ్చేనెల 9 నుంచి 13 వరకు శ్రీవారి తెప్పోత్సవాలకు సంబంధించిన షెడ్యూల్ కూడా విడుదల చేసింది.
 

1 /5

తిరుమల శ్రీ వేంకటేశుని సాలకట్ల తెప్పోత్సవాలు మార్చి నెల 9 నుంచి 13వ తేదీ వరకు అంగరంగ వైభవంగా తిరుమల తిరుపతి దేవస్థాన యంత్రాంగం నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో ఈ ఉత్సవాలకు సంబంధించిన షెడ్యూల్ తాజాగా విడుదల చేసింది.  

2 /5

తిరుమల శ్రీ వెంకటేశుని సాలకట్ల తెప్పోత్సవాలు మార్చి నెల 9వ తేదీ నుంచి 13వ తేదీ వరకు వైభవంగా నిర్వహించనున్నారు.. మొదటగా శ్రీ సీతా లక్ష్మణ ,ఆంజనేయ సమేత శ్రీరామచంద్రమూర్తిగా భక్తులకు శ్రీవారు కనువిందు చేయనున్నారు.  మరుసటి రోజు రుక్మిణి సమేత శ్రీ కృష్ణ భగవానుడిగా.. మూడవరోజు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామిగా శ్రీవారు పుష్కరిణిలో విహరించనున్నారు.  

3 /5

ఇక ఈ తెప్పోత్సవాలు మొత్తం ఐదు రోజుల పాటు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు.. ఈ నేపథ్యంలో 9, 10 తేదీలో సహస్రదీపాలంకరణ, 11, 12, 13వ తేదీల్లో ఆర్జిత బ్రహ్మోత్సవ సేవల్ని తిరుమల తిరుపతి దేవస్థానం రద్దు చేసింది.  

4 /5

భక్తులు ముందుగానే ఈ ఉత్సవాల గుర్తించి ఏ ఇబ్బందులు పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక రేపటి నుంచి మే నెల కోటాకు సంబంధించిన ప్రత్యేక దర్శనం టోకెన్లు అందుబాటులో ఉండానున్నాయి.. ఫిబ్రవరి 24వ తేదీ రూ.300 ప్రత్యేక దర్శనం టికెట్లు కూడా అందుబాటులో ఉండనున్నాయి.  

5 /5

అలిపిరి ఏడో మైలురాయి మార్గంలో చిరుత సంచారం నేపథ్యంలో భక్తులకు కీలక సూచనలు చేసింది టీటీడీ.. కేవలం గుంపులుగానే అనుమతిస్తోంది. వారితోపాటు భద్రత సిబ్బంది కూడా తోడుగా వెళ్తున్నారు. ఇక మధ్యాహ్నం 12 గంటల సమయం దాటిన తర్వాత 12 ఏళ్ల లోపు పిల్లల్ని అనుమతించడం లేదు. సీసీ కెమెరాలతో ఎప్పటికప్పుడు చిరుత ఆనవాళ్లను పర్యవేక్షిస్తున్నారు. అటవీ శాఖ అధికారులు కూడా అప్రమత్తంగా ఉన్నారు.