Nidhhi Agerwal Lodged Cybercrime Case Against Threats: డిప్యూటీ సీఎం, సినీ నటుడు పవన్ కల్యాణ్ హీరోయిన్ నిధి అగర్వాల్‌కు సైబర్ వేధింపులు జరుగుతున్నాయి. ఈ వ్యవహారంపై హీరోయిన్ పోలీసులను ఆశ్రయించింది. తెలంగాణ సైబర్ పోలీసులకు నిధి అగర్వాల్ ఫిర్యాదు చేసింది. అతడిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను విజ్ఞప్తి చేసింది.
ప్రముఖ హీరోయిన్ నిధి అగర్వాల్‌కు సామాజిక మాధ్యమాల్లో వేధింపులు జరుగుతున్నాయి. ఏకంగా చంపుతాం అంటూ ఓ వ్యక్తి బెదిరింపులకు పాల్పడుతున్నాడు.
ఈ బెదిరింపులతో నిధి అగర్వాల్‌తోపాటు ఆమె కుటుంబం తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. భయాందోళన చెందుతున్నారు.
ఇన్స్టాగ్రామ్ వేదికగా ఓ వ్యక్తి అసభ్య పదజాలంతో వేధించడమే కాకుండా హత్య చేస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నట్లు నిధి అగర్వాల్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది.
ఒక ఆగంతకుడు తనను వేధిస్తున్నాడని.. అతడి వేధింపులతో తమ కుటుంబంతోపాటు తాను మానసిక ఒత్తిడికి లోనవుతున్నట్లు వాపోయింది.
అతడిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ నిధి అగర్వాల్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కామెంట్స్ కూడా దారుణంగా చేస్తున్నాడని తెలిపింది.
ఇస్మార్ట్ శంకర్‌తో బంపర్ హిట్ పొందిన నిధి అగర్వాల్ ప్రస్తుతం 'హరి హర వీరమల్లు', 'ది రాజా సాబ్' సినిమాల్లో నటిస్తోంది. ఈ ఏడాది ఈ రెండు సినిమాలు విడుదల కానున్నాయి.