Ram Charan Recent movies Pre Release business:‘గేమ్ చేంజర్’ సహా రామ్ చరణ్ రీసెంట్ మూవీస్ ప్రీ రిలీజ్ బిజినెస్ డీటెల్స్..

Ram Charan Recent movies Pre Release business: రామ్ చరణ్ మెగాస్టార్ చిరంజీవి తనయుడిగా సినీ ఇండస్ట్రీలో ప్రవేశించిన తండ్రి తగ్గ తనయుడిగా రాణించాడు. అంతేకాదు సినిమా సినిమాకు తన చిత్రాలకు సంబంధించిన ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా పెరిగింది. ఆర్ఆర్ఆర్ తో  పీక్స్ చేరినా.. సోలో హీరోగా ‘గేమ్ చేంజర్’ మూవీ అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన చిత్రంగా రికార్డులకు ఎక్కింది.

1 /7

రామ్ చరణ్ తన సినిమాల ప్రీ రిలీజ్ బిజినెస్ ల విషయంలో రికార్డులు క్రియేట్ చేస్తున్నాడు. వినయ విధేయ రామ తర్వాత సోలో హీరోగా ‘గేమ్ చేంజర్’ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ తో కొత్త రికార్డు సెట్ చేశాడు.

2 /7

గేమ్ చేంజర్.. రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కిన చిత్రం ‘గేమ్ చేంజర్’. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 221 కోట్ల అత్యధిక సోలో హీరోగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.

3 /7

ఆచార్య (మల్టీస్టారర్).. చిరంజీవి, రామ్ చరణ్ కథానాయకులుగా  కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఆచార్య’. ఈ సినిమా  తెలుగు రాష్ట్రాల్లో రూ. 107.50 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ప్రపంచ వ్యాప్తంగా రూ. 131.20 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.

4 /7

ఆర్ఆర్ఆర్ (RRR)..   ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా  రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో పుష్ప 2 ముందు వరకు  రికార్డు స్థాయిలో రూ.191 కోట్ల బిజినెస్ చేసింది. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ. 451 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. రామ్ చరణ్ కెరీర్ లోనే హైయ్యెస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన చిత్రంగా రికార్డులకు ఎక్కింది.

5 /7

వినయ విధేయ రామ.. రామ్ చరణ్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘వినయ విధేయ రామ’. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 90 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన చిత్రంగా రికార్డులకు ఎక్కింది.

6 /7

రంగస్థలం.. సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా నటించిన చిత్రం ‘రంగస్థలం’. ఈ సినిమా వరల్డ్ వైడ్ గా రూ. 80 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.

7 /7

ధృవ.. రామ్ చరణ్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ధృవ’. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 57 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.